గల్ఫ్ దేశాలలో వేసవికాలం ఎక్కువ రోజులు ఉండటం సహజం. ముఖ్యంగా కువైట్‌లో జూలై, ఆగస్టు నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. రోజంతా వేడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడమే కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం మార్పులను అధికారకంగా ప్రకటించారు అక్కడ ప్రభుత్వం.
వచ్చే వారంలో కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో వాతావరణం కొంత చల్లబడనుందని నిపుణులు తెలిపారు. వర్షాకాలం ముగింపు దశలోకి వస్తుండగా, ఉష్ణోగ్రతలు మెల్లగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
కువైట్ వాతావరణ శాఖ అధికారి రంజాన్ అల్ అంజాన్ ఈ నెల 21న పాక్షిక సూర్యగ్రహణం ఉన్నప్పటికీ అది కువైట్ లో కనిపించదని ఆయన తెలిపారు. ఆ రోజు నుంచి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుందని అలాగే సెప్టెంబర్ 27 రాత్రి పగలు సమానంగా ఉంటాయని తెలిపారు.
రంజాన్ అల్ అంజాన్ మాట్లాడుతూ ఈ సారి శరదృతువు సాధారణం కంటే కొంచెం ముందుగానే వస్తోందని, అందువల్లే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని అన్నారు. సెప్టెంబర్ చివరి వారంలో 40 డిగ్రీల లోపే పగటి వేడి ఉండే అవకాశం ఉందని వివరించారు. రాత్రి వేళల్లో మాత్రం చల్లదనం మరింత పెరుగుతుందని చెప్పారు.
కువైట్ ప్రజలు సాధారణంగా వేసవికాలంలో ఎక్కువ సమయం ఎయిర్ కండిషనర్లు వాడుతుంటారు. కానీ ఇప్పుడు చల్లటి గాలి రావడంతో, విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇటీవలి రోజుల్లో కువైట్‌లో పగలు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాతావరణంలో మార్పు రావడంతో కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు