విదేశాలకు వెళ్ళాలని అనుకునే ప్రతి ఒక్కరికీ పాస్‌పోర్ట్ అనేది ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్. కానీ పాస్‌పోర్ట్ లేదా వీసా పొందే ప్రక్రియలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేయాలి? అనే సందేహాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మనం సులభంగా తెలుసుకుందాం.
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) అనేది ఒక రకమైన ధృవీకరణ పత్రం. ఇది వ్యక్తి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు అదేవిధంగా ఎలాంటి నేర రికార్డులు లేవు అని నిర్ధారిస్తుంది. మరి ముఖ్యంగా వ్యక్తి నివాస చిరునామా సరిగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఈ సర్టిఫికేట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సాధారణంగా విదేశాలలో ఉద్యోగం చేయడానికి, చదువుకోవడానికి లేదా అక్కడ ఎక్కువ కాలం నివసించడానికి పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే వారు PCC తప్పనిసరిగా తీసుకోవాలి.
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచాలి అది ఈ క్రింది విధంగా తెలపడం జరిగినది.
మీరు ముందుగా పాస్పోర్ట్ అప్లికేషన్ పూర్తి చేసి ఉంటారు అప్లికేషన్ కి సంబంధించిన అసలు, మరియు దాని డూప్లికేట్ ఫొటోకాపీ రెండూ తప్పనిసరిగా కావాలి. తర్వాత మీరు ఈ దేశస్తుడే అని సంబంధించిన
ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, ఓటరు ఐడీ) మొదలైంది మరియు మీ ఇంటి చిరునామా ధృవీకరణ పత్రాలు
మీ చదువుకు సంబంధించిన డాక్యుమెంట్లు కావాలి.
ముందుగా మీ రాష్ట్ర పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి PCC అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసే అవకాశం ఉంటుంది.ఆన్‌లైన్ సదుపాయం లేని చోట స్థానిక పోలీసు స్టేషన్‌లోకి వెళ్లి ఫారమ్ తీసుకోవాలి.అవసరమైన వివరాలు పూర్తి చేసి, పత్రాలతో కలిపి పోలీసు స్టేషన్ లేదా సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు స్వీకరించిన తర్వాత పోలీసులు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే మీ మీద ఎటువంటి క్రిమినల్ రికార్డులు లేవని, చిరునామా నిజమ కాదా అని తెలుసుకోవడం జరుగుతుంది. అన్ని వివరాలు క్లియర్ అయితే, సంబంధిత అధికారి PCC జారీ చేస్తారు.
విదేశాలకు వెళ్ళాలనుకునే వారందరికీ PCC ఒక కీలకమైన డాక్యుమెంట్ కాబట్టి పాస్‌పోర్ట్ లేదా వీసా ప్రాసెస్‌లో ఆలస్యం కాకుండా ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకొని దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కోరుకున్న దేశంలో సరదాగా గడిపేయవచ్చు. గుర్తుపెట్టుకోండి పాస్పోర్ట్ ఉంటేనే వీసా ఉంటుంది పాస్పోర్ట్ కావాలంటే తప్పకుండా
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి.