నిరుద్యోగులకు గొప్ప శుభవార్త భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉండే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కొత్త ఉద్యోగాలు ప్రకటించింది. ఇందులో 542 MSW వెహికల్ మెకానిక్ పోస్టులు భర్తీ చేపడుతున్నారు. ఈ ఉద్యోగానికి ఆసక్తి ఉన్నవారు BRO అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్ ఫార్మ్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 24-11-2025 గా అధికారులు తెలిపారు.
మొత్తం ఖాళీలు: 542
పోస్టు పేరు: MSW వెహికల్ మెకానిక్
వేతనం:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹18,000 నుండి ₹63,200 వరకు జీతం లభిస్తుంది. అదనంగా భత్యాలు, భోజన, గృహ భత్యాలు అధికారిక నిబంధనల ప్రకారం ఇవ్వబడతాయి.
అర్హతలు:
కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI సర్టిఫికేట్
సంబంధిత రంగంలో ప్రాక్టికల్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం
వయసు పరిమితి:
కనీస వయసు: 18 సంవత్సరాలు
గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
SC/ST/OBC/PwD అభ్యర్థుల కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఆఫ్‌లైన్ ద్వారా చేయాలి
దరఖాస్తు ప్రారంభం: 11-10-2025
దరఖాస్తు చివరి తేది: 24-11-2025
మరిన్ని వివరాలు: www.bro.gov.in
దరఖాస్తు రుసుము:
జనరల్, OBC, EWS: ₹50
SC, ST, PwD: రుసుము లేదు
రుసుము అధికారిక చెల్లింపు విధానం ద్వారా మాత్రమే చెల్లించాలి
ఎంపిక విధానం:
ఎంపికలో సాధారణంగా లిఖిత పరీక్ష, టెక్నికల్/ప్రాక్టికల్ పరీక్ష, మరియు ఇంటర్వ్యూ ఉంటాయి
చివరి ఎంపికలో అభ్యర్థుల విద్య, అనుభవం, నైపుణ్యాలు ప్రధానంగా పరిగణించబడతాయి.
BRO అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తప్పకుండా చదువుకొని అప్లై చేసుకోగలరు.
మీరు అప్లికేషన్ పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించి అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా అప్లికేషన్ రద్దు చేయడం జరుగుతుంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేయడం మంచిది, ఎందుకంటే చివరి తేదీ 24 నవంబర్ 2025 మాత్రమే ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వదులుకోకండి.