ప్రస్తుత కాలంలో పెద్దవారి నుంచి చిన్న పిల్లల సైతం విపరీతంగా జుట్టు రాలడాన్ని చూస్తూ ఉంటాం. దీనికి కారణం పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి ఆందోళనలేనని నిపుణులు చెబుతున్నారు. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అలానే రాలిపోతున్న జుట్టుని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సహజ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడం తగ్గి బలంగా ఒత్తుగా పెరగడం సాధ్యమవుతుంది.
అర కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే కాస్త ఎర్రమందారపు పువ్వులు కలిపి పేస్ట్ చేసి తలకు పట్టించండి. అరగంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి నల్లగా మెరుస్తుంది.
ఎర్ర ఉల్లిపాయ రసాన్ని తలకు రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. రెండు రోజులకోసారి చేస్తే జుట్టు ఒత్తుగా దట్టంగా పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు ఉసిరి నూనె లేదా కొబ్బరినూనెతో మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు బలపడతాయి. మన పెరటి లో ఉండే కలబందను గుజ్జు పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేయండి. ఇది జుట్టుకు తేమను అందించి, నల్లగా పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.
కోడిగుడ్డులోని తెల్ల సొనకు కొద్దిగా పెరుగు కలిపి తలకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టుకు అవసరమైన ప్రొటీన్‌ను అందిస్తుంది. అలానే రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం ద్వారా కూడా జుట్టు బాగా పెరుగుతుంది.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే తలస్నానం అనేది కుంకుడుకాయలతో చేస్తే కురులకు చాలా మంచిది మన పురాతన కాలం నుంచి కుంకుడు కాయలను ఉపయోగించేవారు. నేటి సమాజంలో పని హడావిడి ద్వారా కుంకుడు కాయలు అనేవి ఉపయోగించడం లేట్ అవుతుందని అందరూ షాంపూ ఉపయోగిస్తున్నారు.
అయితే కుంకుడుకాయలను , ఉసిరికాయ ముక్కలు,మందారం ఆకు లేదా పువ్వులు బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో వేసి ఒక రెండు రోజులు పాటు అలా చేసిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోండి ఆ పొడిని ఒక వారం పాటు ఎండలో పెట్టుకొని షాంపూ గా ఉపయోగించుకోవచ్చు ఇది మీ జుట్టు రాలడం మరియు ఇతర తలనొప్పి వంటి సమస్యలను మటుమాయం చేస్తుంది.
ఈ సంవత్సరం కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య రీత్యా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది.