కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు నటుడుగా రిషబ్ శెట్టి గ్రామీణ జానపద సంస్కృతిని తెరపై ప్రతిబింబింపజేసినందుకు అభిమానుల నుంచి విశేష ప్రశంసలు పొందారు. తొలి వారంలోనే రూ.500 కోట్ల వసూలు సాధించిన ఈ చిత్రం రికార్డు సృష్టించింది.
ఇటీవల రిషబ్ శెట్టి విలేకరులతో ముచ్చటించి, సినిమాపై అనుభవాలు తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరించారు.రిషబ్ శెట్టి మాట్లాడుతూ స్క్రిప్ట్ రాస్తున్న దశలోనే కాంతార నాకు సవాలుగా అనిపించింది. మా ఊరి జీవన శైలి సంప్రదాయాలు జానపద మూలాలను నిజమైన రూపంలో చూపించాలనుకున్నాం. ప్రతి రోజు సెట్‌లో కష్టపడి ఆ ప్రపంచాన్ని తెరపై జీవం తెచ్చే ప్రయత్నం చేశాం. అయినా ఒత్తిడి అనిపించలేదు అని అన్నారు.
గ్రామీణ జీవితం సంస్కృతి నమ్మకాల ఆధారంగా ఉద్భవిస్తాయని, అందుకే చిత్రీకరణ మొత్తం ఊరిలోనే జరిగినట్లు రిషబ్ చెప్పారు. 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో నిర్మించి నిర్మాణ పనులు కూడా అక్కడే పూర్తి చేశాం. అక్కడ ఊరి ప్రజలు కార్మికులు కళాకారులు, టెక్నీషియన్లుగా పాల్గొన్నారు. వారి సహకారం సినిమా విజయానికి ప్రాణం అని వివరించారు.
రిషబ్ తదుపరి ప్రాజెక్ట్ జై హనుమాన్ జనవరిలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. తెలుగు నేర్చుకుంటున్నా ఇది నాకు కొత్త సవాలు కానీ తెలుగు ప్రేక్షకుల కోసం పూర్తి స్థాయిలో నేర్చుకుంటాను ఈ సినిమాకు కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్పారు.
ఎన్టీఆర్‌తో తన బంధం ప్రత్యేకమని ఆయనతో కలిసి సినిమా చేయడం నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ నా సోదరుడిలా భావిస్తా ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రిషబ్ అన్నారు. కాంతార చాప్టర్ 1 ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఈ లక్ష్యంలో అభిమానులు నాకు తోడు ఉన్నారని ఆయన తెలిపారు