విజయ్‌పై నటి శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ శృతిహాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు.
ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఓ జోకర్ సర్కస్‌కు వెళ్లడం వల్లే ఆ ఘోరం జరిగింది. విజయ్ ఒక జోకర్ మాత్రమే. ఆయన తన పాత్రకు తగ్గట్టుగానే ప్రవర్తించారు. ఆయనను తప్పుపట్టడం అవసరం లేదు. సర్కస్‌కు వెళ్లిన వారే బాధ్యత వహించాలి అంటూ రాశారు. ఈ పోస్టు చూసిన వెంటనే నెటిజన్లు శృతిహాసన్ పై విరుచుకుపడ్డారు. విమర్శలు పెరుగుతున్నాయని గమనించిన శృతిహాసన్ కొద్ది సేపటికే ఆ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా కరూర్‌లో జరిగిన ఆ విషాద ఘటనతో బాధపడిన కుటుంబాలతో విజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జరిగిన నష్టం తిరిగి పూడ్చలేనిది. కానీ మీ కుటుంబాలకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటూ వారిని ఓదార్చారు. ఆయన మాటలు బాధిత కుటుంబాలకు కొంత ధైర్యం ఇచ్చాయి.
విజయ్ ఈ సంఘటనలో చూపిన స్పందనను అభిమానులు సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. మరోవైపు, శృతిహాసన్ చేసిన పోస్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక విజయ్, శృతిహాసన్ ఇద్దరూ గతంలో పులిఅనే సినిమాలో జంటగా నటించారు. అప్పట్లో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరి పేర్లు మరోసారి వార్తల్లోకి రావడం, కానీ వివాదం కారణంగా రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.