రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న కాంతారా: చాప్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ తమిళ భాషల్లో విడుదల కానుంది.
మొదటి భాగం పెద్ద సక్సెస్ కావడంతో రెండో భాగంపై పాన్ ఇండియా స్థాయిలో హైప్ పెరిగింది. ప్రమోషన్స్‌ను కూడా సినిమా టీమ్ కొత్తగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్‌ను ప్రత్యేకంగా నిర్వహించారు చిత్ర యూనిట్.
ఈ రోజు ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్‌లో) షేర్ చేశారు. ట్రైలర్‌ను వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ హీరోల చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అయితే, ఏ పరిశ్రమలో ఏ హీరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారో ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ చేత ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు.
తమిళ చిత్ర పరిశ్రమ నుండి హీరో శివకార్తికేయన్ చేత ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్రైలర్ విడుదల చేయనున్నారు అని పోస్టర్లు రిలీజ్ చేశారు.
హిందీ చిత్ర పరిశ్రమ నుండి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేత ట్రైలర్ విడుదల అవుతుందని ఇప్పటికే పోస్టర్లు లు వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇలా వేర్వేరు పరిశ్రమల స్టార్ హీరోలతో ట్రైలర్‌ను విడుదల చేయించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగాపెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.