దక్షిణ మధ్య రైల్వే నుంచి రైలు ప్రయాణికులకు శుభవార్త. పండుగల సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. దసరా, దీపావళి పండుగల సమయంలో ఊర్లకు వెళ్తున్నవారు, తిరిగి వస్తున్నవారి రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి.
చర్లపల్లి – తిరుపతి ప్రత్యేక రైలు. 07011 నంబర్ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుతుంది. తిరుగు ప్రయాణం 07012 నంబర్‌తో సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం తిరుపతి నుంచి చర్లపల్లికి ఉంటుంది.
తిరుపతి – హిసర్ ప్రత్యేక రైలు. 07717 నంబర్ రైలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం తిరుపతి నుంచి హిసర్‌కు నడుస్తుంది. అదే విధంగా 07718 నంబర్ రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి ఆదివారం హిసర్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది. ఈ రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కాచిగూడ, మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర స్టేషన్లలో ఆగుతాయి.
నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక రైలు. 07189 నంబర్ రైలు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరంకి నడుస్తుంది. తిరుగు ప్రయాణం 07190 నంబర్‌తో సెప్టెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం ధర్మవరం నుంచి నాందేడ్‌కు ఉంటుంది. ఈ రైలు బాసర, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి, కదిరి స్టేషన్లలో ఆగుతుంది.