సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన ఎస్‌బీఐ (SBI) యూత్ ఫర్ ఇండియా (YFI) ఫెలోషిప్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్ ద్వారా గ్రామీణాభివృద్ధి రంగంలో యువతకు సేవ చేసే అవకాశం కల్పిస్తోంది. 13 నెలలపాటు పూర్తి ఫండింగ్‌తో ఇచ్చే ఈ ఫెలోషిప్‌లో ఎంపికైన వారు గ్రామాల్లో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం పొందుతారు. దీనికి నెలకు రూ.15,000 స్టైపెండ్‌తో పాటు ట్రావెల్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాజెక్టుల కోసం అవసరమైన ఖర్చులను కూడా ఎస్‌బీఐ ఫౌండేషన్ భరిస్తుంది.
ఈ ఫెలోషిప్‌లో పాల్గొనడానికి కొన్ని అర్హతలు నిర్దేశించారు. 2025 అక్టోబర్ 6 నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. భారతదేశ పౌరులు మాత్రమే కాకుండా, NRIలు, OCIలు, అలాగే నేపాల్, భూటాన్ దేశాల పౌరులు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్‌బీఐ ఉద్యోగులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. ఎంపికైన వారు రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో జరిగే ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలి.
ఫెలోషిప్‌లో 12 ప్రధాన థీమ్స్ ఉన్నాయి. వాటిలో ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, రూరల్ లైవ్‌లీహుడ్, పర్యావరణ పరిరక్షణ, వాటర్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ, ఆల్టర్నేట్ ఎనర్జీ, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి విభాగాలు ఉన్నాయి. ఫెలోస్ తమకు నచ్చిన థీమ్‌ను ఎంచుకొని, 13 NGOలతో కలిసి రూరల్ ప్రాజెక్టులపై పనిచేయాలి. ఈ ప్రాజెక్టులు గ్రామీణ సమాజంలో నేరుగా ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి.
ఎస్‌బీఐ ఫెలోషిప్ 2011లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 640 మంది యువతీ యువకులు దీన్ని పూర్తి చేశారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో 250 గ్రామాలకు పైగా ఇది ఉపయోగపడింది. ఈ ఫెలోషిప్ పూర్తి చేసిన యువతలో చాలామంది డెవలప్‌మెంట్, పాలసీ మేకింగ్, గవర్నెన్స్, అకడమిక్ రంగాల్లో కెరీర్ కొనసాగించారు. కొంతమంది స్వంతంగా సోషల్ వెంచర్స్‌ను కూడా ప్రారంభించారు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 11లోపు http://apply.youthforindia.org వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. అప్లికేషన్‌తో పాటు ఒక ఎస్సే, వీడియో ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఎంపికైన వారికి ఎస్‌బీఐ నుంచి సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది భవిష్యత్ కెరీర్‌కు ఎంతో ఉపయుక్తం అవుతుంది. ఈ విధంగా ఎస్‌బీఐ ఫెలోషిప్ యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించి, గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది.