Funds Released: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ జిల్లాల్లోని పేదలకు బిగ్ రిలీఫ్.. నిధులు కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం కొత్త ఆలోచనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా హెలికాప్టర్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించబడుతోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలను ఆహ్వానిస్తోంది. ఏజెన్సీల ప్రతిపాదనల ఆధారంగా హెలిప్యాడ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

New Airports: ఏపీలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు! కేబినెట్ కీలక నిర్ణయం... మారబోతున్న రూపురేఖలు!

విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, అరకు వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మినీ విమానాశ్రయాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటిలో సాధారణ విమానాశ్రయాల్లో ఉండే దాదాపు అన్ని సౌకర్యాలు లభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇలాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి హెలీ పర్యాటకాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాయి. దిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రైవేట్ ఏజెన్సీలు చాపర్లు నడుపుతున్నట్లు ఉదాహరణలు ఉన్నాయి.

Weather Report: ఆ ప్రాంతాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు! IMD హెచ్చరికలు జారీ!

ఇప్పటివరకు హెలికాప్టర్ పర్యాటకం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడింది. ఉదాహరణకు విశాఖ ఉత్సవాలు, అరకు పండుగల సమయంలో పర్యాటకుల కోసం హెలికాప్టర్ రైడ్‌లు నిర్వహించబడ్డాయి. అయితే అవి కొన్ని రోజులపాటు మాత్రమే కొనసాగాయి. కానీ ఈ సారి ప్రభుత్వం దీన్ని శాశ్వతంగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా విజయవాడ, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు నిరంతరం నడపాలని యోచిస్తోంది. ఇది భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Smart Ration Card: రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఇకపై ఆ కష్టాలు తీరినట్లే!

విశాఖపట్నం, అరకులో పర్యాటక అభివృద్ధికి ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. రుషికొండ వద్ద స్కూబా డైవింగ్, సముద్రంలో స్పీడ్ బోట్లు, స్కై సైక్లింగ్, జిప్‌లైనింగ్ వంటి వినోద సదుపాయాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు అరకులోని బొర్రా గుహలను కూడా మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆటోమేటిక్ గేట్లు, కొత్త లైటింగ్ సదుపాయాలు, మెట్ల మరమ్మతులు వంటి పనులు జరుగుతున్నాయి.

Secretariat Jobs: సచివాలయ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! మొత్తం 2778 పోస్టులు!

ఇక గండికోట, అరకు, సూర్యలంక ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిని పీపీపీ మోడల్‌లో లేదా ఏపీటిడీసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తారు. ఈ అన్ని చర్యలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కొత్త దిశగా సాగనుంది. మినీ విమానాశ్రయాల ఏర్పాటు, హెలీ పర్యాటక సేవల విస్తరణ పర్యాటకుల రాకపోకలను మరింత సులభతరం చేసి రాష్ట్రానికి ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా లాభాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Pension: వారందరికీ పెన్షన్లు రద్దు! వారికిచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి... సీఎం ఆదేశాలు జారీ!
Central Government: కేంద్రం కీలక ప్రకటన! ఏపీలోని ఆ రెండు కులాలు ఎస్టీల్లోకి..
Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష... దరఖాస్తు వివరాలు!
Air Canada: ప్రయాణికులకు అలర్ట్! ఆ విమానాలు రద్దు! ముందుగా చెక్ చేసుకోకుంటే తిప్పలు తప్పవు!
స్విట్జర్లాండ్‌లో ఆస్తులు కొనుగోలు చేసే హక్కు ఇప్పుడు వారికి మాత్రమే!
Super Fast Express: రైల్వే ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త! ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అక్కడకు కూడా... షెడ్యూల్!
Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!