ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Minister Amit Shah), ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం (Polavaram) – బనకచర్ల (Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరుపనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: 24 గంటల్లో 50 దాడులు.. పాకిస్తాన్ కు చుక్కలు చూపుతున్న వేర్పాటువాదులు
జులై 15వ తేదీ ఉదయం అమరావతి (Amaravati) నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. జులై 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి హాజరవుతారు. 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరుతారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!
Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!
Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: