UAE Attack: ఇరాన్‌పై భారత్ ఫైర్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఘాటు స్పందన! Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక సంఘాల సమన్వయం! Iran War: ఇరాన్ vs అమెరికా.. ముదురుతున్న చమురు యుద్ధం.. ఆర్థిక దిగ్బంధనంతో పశ్చిమాసియాలో ఉత్కంఠ.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న మాటల యుద్ధం.. కాల్పుల విరమణ ఉన్నా తగ్గని ఇరాన్-అమెరికా సెగ.! Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Saudi: సౌదీకి గట్టి షాక్.. 60 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. చమురు రాజకీయాల్లో పెను సంచలనం.. UAE Updates: యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు.. మే 1వ తేదీ నుంచి! Iran & India: పశ్చిమాసియాలో ఉద్రిక్తత - మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు! America Iran War: వెనక్కి తగ్గేదే లేదు.. నన్ను ఏ శక్తీ ఆపలేదు! కాల్పుల ఘటన.. ఇరాన్‌తో చర్చలు రద్దు చేసిన ట్రంప్.. Iran War: అమెరికాతో ముఖాముఖి చర్చల్లేవు.. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ.. UAE Attack: ఇరాన్‌పై భారత్ ఫైర్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఘాటు స్పందన! Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక సంఘాల సమన్వయం! Iran War: ఇరాన్ vs అమెరికా.. ముదురుతున్న చమురు యుద్ధం.. ఆర్థిక దిగ్బంధనంతో పశ్చిమాసియాలో ఉత్కంఠ.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న మాటల యుద్ధం.. కాల్పుల విరమణ ఉన్నా తగ్గని ఇరాన్-అమెరికా సెగ.! Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Saudi: సౌదీకి గట్టి షాక్.. 60 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. చమురు రాజకీయాల్లో పెను సంచలనం.. UAE Updates: యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు.. మే 1వ తేదీ నుంచి! Iran & India: పశ్చిమాసియాలో ఉద్రిక్తత - మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు! America Iran War: వెనక్కి తగ్గేదే లేదు.. నన్ను ఏ శక్తీ ఆపలేదు! కాల్పుల ఘటన.. ఇరాన్‌తో చర్చలు రద్దు చేసిన ట్రంప్.. Iran War: అమెరికాతో ముఖాముఖి చర్చల్లేవు.. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ..

UAE Attack: ఇరాన్‌పై భారత్ ఫైర్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఘాటు స్పందన!

UAE Attack: పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దాడులతో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా యూఏఈలోని ‘ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్’పై దాడి చేయడం పరిస్థితులను మరింత దిగజార్చాయి.

Published : 2026-05-05 12:26:00
  • Gulf: హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు..
     
  • అంగీకరించలేమని భారత్ ఫైర్..

UAE Attack: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దాడుల రూపం దాల్చడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని వ్యూహాత్మక ప్రాంతమైన ‘ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్’ లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఈ పెట్రోలియం జోన్‌పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది.

భారతీయులు గాయపడిన ఈ ఘటనను విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఘాటుగా స్పందించింది. ‘‘ముగ్గురు భారతీయుల గాయానికి కారణమైన ఫుజైరా దాడిని ఏమాత్రం అంగీకరించలేం. వెంటనే ఈ ఘర్షణలను విరమించుకోవాలని, పౌర మౌలిక సదుపాయాలు మరియు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని కోరుతున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వం నెలకొనేలా సాగే చర్చలకు, దౌత్య పరమైన ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్ఛాయుత నౌకాయానం మరియు ప్రపంచ వాణిజ్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా అన్ని పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. సమస్యలు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని భారత్ సూచించింది. ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →