ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 విధానం అమలుపై సీఎం చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సమీక్షించారు. పీ4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా.. వారిలో ఇప్పటి వరకు 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. సమాజంలో చాలామంది ఏదో ఒక రూపంలో పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారికి పీ4ను వేదికగా మార్చాలని సీఎం అన్నారు.
ఇది కూడా చదవండి: Vande Bharat Trains: ఏపీలో అక్కడ వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.270 కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ
మార్గదర్శులుగా ఉండేవారిని సంప్రదించేందుకు.. బంగారు కుటుంబాలను వారితో అనుసంధానం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. "ఈ కార్యక్రమాన్ని నిత్యం మోనిటరింగ్ చేసేందుకు కాల్ సెంటర్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. మార్గదర్శులుగా ఉండాలనుకునే వారికి అవసరమైన సమాచారాన్ని, గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానించిన తర్వాత అంతకు ముందు వారి పరిస్థితి, బంగారు కుటుంబంగా ఎంపికైన తరువాత వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్వేలను కూడా నిర్వహించాలి.
ఇది కూడా చదవండి: Jalaharathi Corporation: సాగునీటి ప్రాజెక్టులకు జలహారతి! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కార్యక్రమం అమలుపై విధిగా ఆడిటింగ్ నిర్వహించడం, మూడు నెలలకు ఒకసారి సమీక్షించడంతోపాటు పీ4 ప్రభావాన్ని నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శులకు కూడా అందించాలి. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఐర్లు, సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలవారితో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పీ4 కాన్సెప్ట్ను వివరించి.. వారిని మార్గదర్శులుగా ఉండేందుకు ఆహ్వానించాలి. ఈ కార్యక్రమానికి మార్గదర్శుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్ 100 కంపెనీలకు చెందిన సీఈవోలు, సీవోవోలు, సీఎఫ్వో, ఎండీలు, చైర్మన్లతో నేరుగా నేనే మాట్లాడి పిలుపునిస్తా.
ఇది కూడా చదవండి: NASA–SpaceX: జై హింద్ జై భారత్ ఇది నా జర్నీ కాదు... భారత అంతరిక్ష యాత్ర కొత్త దశలోకి!
దీంతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శులుగా ముందుకొచ్చేందుకు వారిని ఆహ్వానిస్తా. ఎన్ఆరలను పీ4 అడ్వైజర్లుగా పెట్టి.. వారిని మార్గదర్శకులుగా చేర్చేందుకు ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, పీ4 కాన్సెప్ట్ను ప్రమోట్ చేసేందుకు రూపొందించిన పలు లోగోలను సమీక్షలో సీఎం పరిశీలించారు. త్వరలో ఒక లోగోను ఎంపిక చేయనున్నారు. అదే విధంగా పీ4ను ప్రారంభించిన మార్చి 30వ తేదీని పీ4 వార్షికోత్సవంగా నిర్వహించి సాధించిన విజయాలను చాటి చెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: