Pharma-project: ఆంధ్రప్రదేశ్‌కి మరో మెగా ఫార్మా ప్రాజెక్ట్... లారెస్ ఫార్మా నుంచి రూ.5,630 కోట్ల పెట్టుబడి!

అయిదేళ్ల వైఎస్సార్ సిపి పాలనలో ఎపి ఎంతలా నాశనమైందో మీకు తెలుసు, పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 

Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త..!ఎన్నాళ్లకెన్నాళ్లకు!

సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఎపిఎన్ఆర్ టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు…రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐ లంతా భాగస్వాములు కావాలి.  

savitha Comments: బీసీ హాస్టళ్లపై చర్చకు సిద్ధమేనా? – వైకాపాకు మంత్రి సవిత ఛాలెంజ్!

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచే అధికశాతం ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం $81.04 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు వస్తే,  అందులో సింగపూర్ నుంచే దాదాపు $14.94 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. 

PMVBRY: వారికి శుభవార్త... రూ.15 వేలు బోనస్! ఆగస్టు 1 నుండి అమలు!

మొత్తం ఎఫ్ డిఐలలో సింగపూర్ నుండి 19శాతం ఉన్నాయి. ఈ పెట్టుబడుల్లో అధికశాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, ఇండోనేషియా, జకార్తా & బాలిలో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం. 

Tamilnadu CM: తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు! విస్తృత తనిఖీల అనంతరం..!

ఎపిఎన్ఆర్ టి ద్వారా మీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి మేము పనిచేస్తున్నాం. ఇకడ ఉద్యోగులుగా ఉన్న మీలో చాలా మంది మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యాజమానులుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు స్టార్టప్ లు పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఈడిబి సేవలు ఉపయోగించుకోండి. మన రాష్ట్రం మీకు సాదర స్వాగతం పలుకుతోంది.

CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?

మీరు ఎన్ఆర్ఐలు కాదు...ఎంఆర్ఐలు 
నాకు ఇష్టమైన, నేను స్పూర్తి పొందిన నాయకుల్లో లీ కువాన్ యూ ఒకరు. 31 ఏళ్లు నిరంతరంగా ప్రధాన మంత్రిగా  పనిచేసి ఒక్క మత్స్యకార గ్రామాన్ని గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా  మార్చారు. సింగపూర్ లో తెలుగు వారి ఉత్సాహం సూపర్. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుండి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసిన తెలుగువాళ్లే. 

BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!

నేను సింగపూర్‌లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అని సందేహం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన తెలుగు వారి ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చాక కూడా నాకో విషయం అర్ధం అయింది.  సింగపూర్ ని శాసించేది కూడా తెలుగువాళ్లే.  అందరూ మిమ్మల్ని ఎన్నారైలు అంటారు అంటే ప్రవాస భారతీయులు. కానీ నా మనసులో ఎప్పుడు మీరు ఎంఆర్ఐలే... MRI అంటే అత్యంత విశ్వసనీయ భారతీయులు (Most Reliable Indians).

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!

తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపిన సిబిఎన్
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టిడిపి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన బ్రాండ్ సిబిఎన్. చంద్రబాబు గారు ఆరోజు ఐటీ అంటే కంప్యూటర్లు తిండి పెడతాయా అని కొందరు విమర్శలు చేసారు. 

Godavari: ఎగువ నుంచి భారీ ప్రవాహం... పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి!

చంద్రబాబు గారు ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శించారు. కానీ ఈ రోజు  ఆ కంప్యూటర్లతోనే తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు.  ఆది విజనరీ అంటే... అదీ సిబిఎన్ బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రవాస భారతీయులు ఉన్నారు. ఒక్క ఫార్ ఈస్ట్ లోనే  3 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ లో జరుగుతున్న ఈ తెలుగు ప్రవాసుల సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుండి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు... ఆదీ మన శక్తి.

Auto Mutation: ఏపీలో ఆస్తులు కొంటున్నారా.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు..! ఆగస్టు ఒకటి నుంచి పక్కా!

ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కీలకపాత్ర 
కష్టపడి చదువుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు.  ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తూ తెలుగువారు సత్తా చాటుతున్నారు. మనిషి సింగపూర్ లో, మలేషియాలో ఉన్నా... మీ మనసంతా ఎప్పుడూ మన రాష్ట్రం పైనే ఉంటుంది. రాష్ట్రం పై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికల్లో చూసాను. రాష్ట్రం లో సైకో పాలన పోవాలని ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఏకమయ్యారు. 

Annadata sukhibhav : ఆగస్టు 2,3 తేదీల్లో అన్నదాత సుఖీభవ... అచ్చెన్న!

చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులకి జైలులో పెట్టినపుడు బాధపడ్డాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు... ఇటువంటి రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి నాతో అంది. అప్పుడు నేను కూడా ఆలోచనలో పడ్డాను. కానీ అదే రోజు హైదరాబాద్‌లో ఉన్న ఐటీ నిపుణులు అంతా కలిసి ఒక భారీ కాన్సెర్ట్ నిర్వహించారు. 

Chandrababu Meeting: తెలుగు డయాస్పోరా తో చర్చలు.. రాష్ట్రాభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసిన సీఎం!

ఆయనని జైలులో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవలు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పని చేసారు. కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు గెలవడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు.  ఎన్ఆర్ఐలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాము, నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చాం.

Chandrababu: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోంది... చంద్రబాబు ప్రకటన! సింగపూర్‌లో కీలక భేటీ!

మన బ్రాండ్ సిబిఎన్! 
ప్రతి దేశానికి, ప్రతి వస్తువుకి ఒక బ్రాండ్ ఉంటుంది.. సింగపూర్ అంటే అభివృద్ధి.  ఏపీలో అభివృద్ధి అంటే సిబిఎన్.. ఇది మన బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్ తో ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పెట్టుబడులు వస్తాయి. బ్రాండ్ ఎపి ప్రమోషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించే మా ప్రయత్నాలకు మీ సహకారం అవసరం. 

Lokesh Speech: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నారై లే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా.! ఆ క్రెడిట్ చంద్రబాబుకే!

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రోల్ మోడల్ సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం.  మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపారమైన వనరులు ఉన్నాయి. మన రాష్ట్రం లో అభివృద్ధికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్లకి పైగా తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, నౌకాశ్రయాలు, భూములు కనెక్టివిటీ ఉన్న మన రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ కానుంది. క్వాంటం వ్యాలీతో ప్రపంచమే మన వైపు చూస్తుంది. టిసిఎస్, కాగ్నిజెంట్, ఎఎన్ఎస్ఆర్, సత్వ, సిఫీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఎపికి వస్తున్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమృత లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. బిట్స్ పిలానీ త్వరలోనే రాష్ట్రానికి రానుంది.

Butchaiah Comments: ప్రజా జీవితాలతో ఆటలాడితే కఠిన శిక్షలు తప్పవు – గోరంట్ల హెచ్చరింపు!

ఉద్యోగాల కల్పనే మన నినాదం! 
మానవవనరులు, మౌలిక సాదుపాయాలున్న మన రాష్ట్రానికి పెట్టుబడుల ప్రతిపాదనలతో రండి... అనుమతులు తీసుకొని వెళ్లండి... యువతకు ఉద్యోగాలను కల్పించండి... 20 లక్షల ఉద్యోగాల కల్పన – ఇదే మన నినాదం... ఇదే మన విధానం.  అప్పట్లో చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుతో జన్మభూమి కార్యక్రమానికి ఎన్నారైలు అండగా నిలిచారు. 

Auto Drivers: ఏపీలోని ఆటోడ్రైవర్లకు శుభవార్త..! ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..!

నేడు జీరో పావర్టీ లక్ష్యంగా చంద్రబాబు గారు తలపెట్టిన P4 కి ఎన్నారైల సహకారం కోరుతున్నాం. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు గారి కోరిక. ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి పని చేద్దాం. P4 లో మార్గదర్శిగా చేరండి.. పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలి.

Regularisation Scheme: నగర, పట్టణ వాసులకు అలర్ట్..! త్వరపడండి.. మంచి ఛాన్స్!

డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి! 
ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో ఎపిలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోంది, కేంద్రంలో నరేంద్ర మోడీజీ, ఎపిలో చంద్రబాబుగారి నేతృత్వంలో పనిచేస్తున్నాం. అయిదేళ్లలో నష్టపోయిందంతా వడ్డీతో సహా తీసుకొస్తాం. ఇతరదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

UPSC EPFO Jobs: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..! మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!

ఎంఎస్ఎంఇ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తాం, ప్రపంచవ్యాప్తంగా 80శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎస్ఈల ద్వారానే వస్తున్నాయి. టిసిఎస్ లో 35శాతం తెలుగువారు పనిచేస్తున్నారు, అందుకే ఎపికివస్తున్నామని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు.  శాసనసభ్యుల్లో 50శాతం మంది కొత్తవారు ఉన్నారు, మంత్రివర్గంలో 17మంది కొత్తవారు, మీరంతా సహకరిస్తే ఎపిని నెం.1గా తయారుచేస్తాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తాం. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు.  సింగపూర్ లో ఇంతమంది తెలుగువారు రావడం ఎప్పుడూ చూడలేదు. 

Mega Project: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ... రూ. 20 వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

ఇక్కడ ఉన్నవారిలో ఒక ఎనర్జీ కనపడుతోంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కసి మీలో ఉంది.  ఎపి ఎన్ ఆర్ టి 2.0 ప్రారంభించాం, ఎన్ఆర్ఐలకు ఎటువంటి సమస్యలున్నా ఎపిఎన్ఆర్ టి మీకు అండగా ఉంటుంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారత్ భూభాగంలో వచ్చినపుడు మొదటిసారి దేశప్రధాని ఉగ్రవాదుల క్యాంప్ పై మెరుపుదాడులు చేయించారు.  ఆ దాడుల్లో మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారు, అంతకు ముందు నాకు ఏదైనా అయితే ఆయన దేశం నావెనుక ఉంటుందని మురళీ నాయక్ చెప్పారు. అటువంటి జవానుకు మనమంతా నివాళులర్పించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
 

Kadapa Steel Plant: స్టీల్ సిటీగా కడపకి శుభారంభం – తొలి దశ పనులకు శ్రీకారం! లక్షల ఉద్యోగాలకు గేట్వే!