వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దుబాయ్ నుంచి హైదరాబాద్కు జరిగిన లావాదేవీలన్నీ బయటపడుతున్నాయని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) అన్నారు.
జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి ఉరిశిక్ష వేయాలని కోరారు. రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. "వైకాపా నాయకులారా ఖబడ్డార్.. మీరు ఆట మొదలు పెట్టారు.. మేం ముగిస్తాం. ఎంపీ మిథున్రెడ్డికి రేషన్ బియ్యం అక్రమాలతోనూ లింకులు ఉన్నాయి.
కేసీఆర్, జగన్ తోడుదొంగల్లా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేదు? "అని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారన్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        