Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,588 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 3,406 కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు పురుష అభ్యర్ధులకు, 182 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు మహిళా అభ్యర్ధులకు కేటాయించారు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

Godavari: ఎగువ నుంచి భారీ ప్రవాహం... పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి!

 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 24, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. పురుషులకు ఎత్తు కనీసం 165 సెంటీమీటర్లు, ఛాతీ 75 నుంచి 80 సెంటీమీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకు ఎత్తు 155 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి.

Auto Mutation: ఏపీలో ఆస్తులు కొంటున్నారా.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు..! ఆగస్టు ఒకటి నుంచి పక్కా!

 ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 23, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.150 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.

Kadapa Steel Plant: స్టీల్ సిటీగా కడపకి శుభారంభం – తొలి దశ పనులకు శ్రీకారం! లక్షల ఉద్యోగాలకు గేట్వే!
Mega Project: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ... రూ. 20 వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!
UPSC EPFO Jobs: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..! మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!
Regularisation Scheme: నగర, పట్టణ వాసులకు అలర్ట్..! త్వరపడండి.. మంచి ఛాన్స్!
Auto Drivers: ఏపీలోని ఆటోడ్రైవర్లకు శుభవార్త..! ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..!
Butchaiah Comments: ప్రజా జీవితాలతో ఆటలాడితే కఠిన శిక్షలు తప్పవు – గోరంట్ల హెచ్చరింపు!
Lokesh Speech: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నారై లే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా.! ఆ క్రెడిట్ చంద్రబాబుకే!