బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం మేకర్స్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు “డబుల్ హౌస్ – డబుల్ డోస్” థీమ్‌ను సిద్ధం చేశారు. ఈసారి సెలబ్రిటీలకు ఒక హౌస్, సామాన్యులకు మరో హౌస్ వేరు వేరుగా ఏర్పాటు చేయబోతున్నారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపికైన 40 మంది సామాన్యులు ‘అగ్ని పరీక్ష’ అనే పోటీల్లో పాల్గొని, విజేతలు ఒక్కొక్కరుగా సెలబ్రిటీల హౌస్‌లోకి ఎంట్రీ పొందేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం ఆగస్టు 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
ప్రోమోలో వెన్నెల కిషోర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని చెప్పగా, నాగార్జున “ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశాను” అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. రెండు హౌసుల్లో ఒకేసారి గేమ్ నడవడం, మధ్యలో కాంపిటెంట్స్ మారడం వంటివి ఈ సీజన్‌లో కొత్త అనుభవంగా ఉండబోతున్నాయి. అలాగే, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ ఈ ‘అగ్ని పరీక్ష’కు జడ్జ్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని టాక్ ఉంది.