తల్లికి వందనం’ నగదులో విద్యార్థికి రూ.2వేలు చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించలేకపోతే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటానని హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై శుక్రవారం మాట్లాడారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని, నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొన్నారు. దానిపై చట్టప్రకారం ముందుకెళ్తానని లోకేశ్‌ తేల్చి చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థులకు రూ.8,745 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమవుతుందని స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్! పట్టుబడిన వారిలో..

అప్పటికీ నగదు రానివారు జూన్‌ 26 వరకు మనమిత్ర వాట్సాప్‌ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిదిద్దుతామని చెప్పారు. 2శాతం మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నగదు జమ కాలేదని, అలాంటి వారికి ఖాతా యాక్టివేట్‌ చేయించుకోవాలని మె సేజ్‌లు పంపామని వివరించారు. ‘‘80శాతం మందికి విద్యార్థి మిత్ర కిట్లు అందజేశాం. మిగిలినవారికి ఈ నెల 20లోగా అందిస్తాం. మధ్యాహ్న భోజనం పథకాన్ని సన్నబియ్యంతో అమలు చేస్తున్నాం. తరగతికి ఒక టీచర్‌ అనే విధానంతో 9,600 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశాం. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్య త మా ప్రభుత్వానిది’ అని తల్లిదండ్రుల కు లోకేశ్‌ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group