ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి, శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం తగ్గి, అధికారులు అన్ని గేట్లను మూసివేశారు. జూరాల మరియు సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 1,18,468 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ప్రస్తుతం, జలాశయం కుడి, ఎడమ గట్లపై ఉన్న జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,851 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాయంత్రం నాటికి, శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.10 అడుగులు కాగా, నీటి నిల్వ 199.7354 టీఎంసీలుగా నమోదైంది.