2026లో ప్రారంభం కానున్న యూఏఈ హై-స్పీడ్ రైలు సేవ, ఆ దేశంలోని అంతర నగర ప్రయాణాలను పూర్తిగా మార్చివేయనుంది. ఈతిహాద్ రైలు సంస్థ అందించబోయే ఈ ప్రయాణికుల రైలు సేవ ద్వారా, దుబాయ్ నుంచి అబూదబీకి కేవలం 60 నిమిషాల్లో చేరవచ్చు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా యూఏఈలో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మరింత ఆధునికంగా మారనుంది. అదే సమయంలో రోడ్డు ట్రాఫిక్ తగ్గించడంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడనుంది.
ఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ను యూఏఈ ప్రభుత్వం కీలకంగా తీసుకుని వేగంగా అమలు చేస్తోంది. 2026 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.