పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఎకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. అయితే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం పిఎం కిసాన్ యోజన మాత్రమే కాదు అనేక పథకాలను రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నీ కూడా వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడంతోపాటు, రైతులకు మేలు చేస్తున్నాయి అలాంటి పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 వ్యవసాయ పథకాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.
1. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Kisan Maandhan Yojana - PM-KMY): కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీమ్ కింద వృద్ధాప్యంలో రైతులకు పెన్షన్ చెల్లిస్తారు ఇందుకోసం రైతులు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతినెల 55 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది అనంతరం 60 సంవత్సరాల తర్వాత రైతులకు 3000 రూపాయల పెన్షన్ చెల్లిస్తారు. ఈ స్కీం ఎల్ఐసి ద్వారా పెన్షన్ మేనేజ్మెంట్ పథకం ద్వారా అందుబాటులో ఉంది.
2. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana - PMFBY) : ఈ స్కీం కింద పంట నష్టాలకు బీమా కవరేజీ లభిస్తుంది. విత్తనం వేసే ముందు నుంచి కోత వరకు పంట నష్టాలకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ స్కీం కింద ఇప్పటివరకు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల క్లైములకు చెల్లింపులు జరిగాయి
3. వడ్డీ సబ్సిడీ పథకం (Modified Interest Subvention Scheme - ISS): ఈ స్కీం కింద రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలను అందిస్తున్నారు ఇందులో మూడు శాతం వడ్డీ మాఫీ ఉంటుంది అంటే నికరంగా నాలుగు శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి.
4. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund - AIF): ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రైతులకు లక్ష కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తున్నారు. . ఇందులో మూడు శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది.
5. కొత్త 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాల స్థాపన (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs): ఈ స్కీం కింద రైతులకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రుణం లభించే అవకాశం ఉంది.
6. జాతీయ తేనెటీగల పెంపకం & తేనె మిషన్ (National Beekeeping and Honey Mission - NBHM): తేనే ఉత్పత్తిని పెంచడానికి శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించేందుకు ఈ బి కీపింగ్ హనీ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద హనీ టెస్టింగ్ ల్యాబ్స్ మినీ లాబ్స్ ఏర్పాటు చేశారు.
7. ధరల మద్దతు పథకం (Price Support Scheme - PSS): పండించిన పంటల మద్దతు ధరల కోసం ఏర్పాటు చేసిన ఈ స్కీం ప్రకారం రైతులకు ప్రత్యేకంగా రక్షణ కలిగేలా ధరల నియంత్రణ ఎలా చేయాలి అనే దానిపైన సూచనలు చేస్తుంది.
8. నమో డ్రోన్ దిదీ పథకం (Namo Drone Didi Scheme): ఈ స్కీం కింద మహిళలకు మహిళ గ్రూపులకు 15వేల డ్రోన్లను 80% సబ్సిడీతో అందించారు. ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.