లిక్కర్ స్కాంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోయినా.. రేపో.. ఎల్లుండో నిందితులకు శిక్ష తప్పదని.. ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
కేసీఆర్ కూతురు కవితనే లిక్కర్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లివచ్చారని ఉదహరించారు. మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళను లోపలేస్తే..వైసీపీ వాళ్ళు పరామర్శలకు వెళ్తున్నారని మండిపడ్డారు.
ఒక పక్క రేపే ఎన్నికలు జరుగుతాయనే రీతిలో వైసీపీ నేతలు హడావుడి చేస్తుంటే.. మరో పక్క ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి రేపే సీఎం అవుతున్నట్లు ఊహా లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మంచి జరగకూడదు.. పెట్టుబడులు రాకూడదు.. ప్రజలు సంతోషంగా ఉండకూడదనేదే వైసీపీ పార్టీ కోరుకుంటోందని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు.