జిల్లాలోని ఆదోనీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా (Cricket Betting Gang) యథేచ్ఛగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా యువతకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ముగ్గులోకి దింపుతున్నారు. పలు బెట్టింగ్ యాప్‌ల ద్వారా యువతను ఇందులోకి లాగుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి యువతను బెట్టింగ్ పెట్టేలా చేస్తున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో వందలు, లక్షల్లో యువత అప్పుచేసి మరీ బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్‌లో యువత ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
ఇది కూడా చదవండి: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ!
బెట్టింగ్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదులు అందండతో దీనిపై దృష్టి సారించారు. ఇవాళ(శనివారం) పలువురిని ఆదోనీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోనీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.91 లక్షల నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడారు. బెట్టింగ్ వల్ల నిర్వాహకులకు మాత్రమే లాభం ఉంటుందని సామాన్యులు మోసపోతున్నారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ బుకీలు డబ్బు ఆశ చూపి యువతను క్రికెట్ బెట్టింగ్‌కు ప్రోత్సహించినా..బెట్టింగ్‌కి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ జైలుకుపోవడం మాత్రం పక్కా.. రెండు రోజుల క్రితం అనంతపురంలో..
పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత.. ఈరోజు సాయంత్రం వరకు!
ఈరోజు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?
క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..
వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: