ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు (Senior IPS officer PSR Anjaneyulu) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చు తగ్గులు ఉండటంతో పీఎస్సార్‌ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మొదట్లో ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారంటూ పీఎస్సాఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏపీపీఎస్సీలో అనేక అవకతవలకు పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారిపై అభియోగాలు నమోదు అయ్యాయి. పేపర్ మూల్యాంకణానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా వ్యవహారం నడిపించారని పీఎస్సార్‌తో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్!
ఆపై ఇరువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. రెండు రోజుల క్రితం జత్వానీ కేసులో హైకోర్టు ఐపీఎస్ అధికారికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులో మాత్రం రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో వయసు రీత్యా బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో ఆంజనేయులు ఇబ్బంది పడుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో వారం క్రితమే ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మళ్లీ ఈరోజు (శనివారం) గతంలో మాదిరిగానే బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో పీఎస్సార్‌ను జిల్లా జైలు అధికారులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఐపీఎస్‌కు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అనంతరం పీఎస్సార్‌ను తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈరోజు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?
క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..
వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: