ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 'గృహిణి' పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ 'గృహిణి' పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారి (వన్‌టైం) కింద రూ.15 వేలు అందించాలని కాపు కార్పొరేషన్ ప్రతిపాదించింది అన్నారు. ఈ మేరకు రూ. 400 కోట్లు అవసరమని అంచనా వేశారన్నారు.. త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ కొత్త పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తామన్నారు.
గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున.. ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు.. ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తోంది. అయితే త్వరలోనే కాపు మహిళకు ఆర్థిక చేయూతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
2014 నుంచి ఏపీ ప్రభుత్వం కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు, సంక్షేమ పథకాలతో పాటూ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.. కాపు మహిళల కోసం పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు శుభవార్త! విశాఖ-భువనేశ్వర్ ఎయిర్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్ !
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్..! రివాల్యుయేషన్ పెట్టగా..!
ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ..! ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు..! సీఎస్ ఉత్తర్వులు జారీ!
అమెరికా మరో కీలక నిర్ణయం! విద్యార్ధి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా బ్రేక్..!
జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ! గల్ఫ్ మోసాల కేసులో..!
ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ మీకోసమే..!
రూ.లక్షలోపు రుణమాఫీ.. వీరికి వర్తింపు! మార్గదర్శకాలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: