లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో కూడా మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి తరహాలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. అనంతపురం నగరంలోని పలు కాలనీల్లో ఈరోజు ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కడపలో ఇటీవల జరిగిన మహానాడుకు 7 నుంచి 8 లక్షల మంది ప్రజలు హాజరై అత్యంత విజయవంతం చేశారని దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. ఈ ప్రజా స్పందన చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిందని, ఏం చేయాలో తెలియక 'వెన్నుపోటు దినోత్సవం' అంటూ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాము జూన్ 4వ తేదీన 'విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు' అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత.. ఈరోజు సాయంత్రం వరకు!
గతంలో మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వెలుగుచూస్తున్న లిక్కర్ స్కామ్‌లో కూడా ధనుంజయ రెడ్డి, గోవిందప్పలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి ముఖ్యమంత్రి జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదని దగ్గుబాటి ప్రసాద్ జోస్యం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురంలో ఓ సచివాలయ ఉద్యోగిని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్‌లో దూషించిన ఘటనపై స్పందిస్తూ, ఈ విషయంలో కచ్చితంగా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగుల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా, ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈరోజు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?
క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..
వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: