మనుషుల అక్రమ రవాణా చేసే క్రమంలో నలుగురు భారతీయుల మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష ఖరారు చేసినట్లు యూఎస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్పష్టం చేసింది. ఈ కేసులో హర్షకుమార్ రమణ్‌లాల్ పటేల్‌కు 10 ఏళ్లు, స్టీవ్ ఆంథోనీ షాండ్‌కి ఆరు ఏళ్లు జైలు శిక్ష విధించిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. భారత్ నుంచి కెనడాకు స్టూడెంట్ వీసాలపై భారతీయులను తీసుకు వచ్చి.. అటు నుంచి వారిని అమెరికాకు అక్రమంగా వీరిద్దరు తరలించారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ధారించింది. ఈ నలుగురు మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు 11 ఏళ్ల బాలిక కూడా ఉందని తెలిపింది. 2022, జనవరిలో హర్షకుమార్, స్టీవ్ ఆంథోనిలు.. కెనడా నుంచి 11 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: ఆ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ముందుకు వెళ్లలేక.. వెనక్కు రాలేక!
ఆ సమయంలో వాతావరణం ఏ మాత్రం అనుకూలించ లేదు. భారీ మంచు తుఫాన్ వచ్చింది. అందులో చిక్కుకుని ఈ నలుగురు భారతీయులు మరణించారు. అయితే వీరు యూఎస్‌కు అక్రమ మార్గంలో తరలి వస్తున్న సమయంలో మిన్నెసోటా మంచులో వ్యాన్ చిక్కుకుంది. దీనిని యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ గుర్తించారు. కానీ అందులో ఎవరు ప్రయాణం చేయడం లేదంటూ వారికి స్టీవ్ సమాధానమిచ్చాడు. అదే సమయంలో ఇంతలో మరో ఐదుగురు వ్యక్తులు పంట పొలాల ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో.. అత్యవసర పరిస్థితుల్లో అతడిని విమానంలో ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఇద్దరు వలసదారులతోపాటు స్టీవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొద్ది రోజు తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్షకుమార్, స్టీవ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో వీరిద్దరి పాత్రపై విచారణ జరిపి.. తుదకు శిక్షను ఖరారు చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: