తొలిరోజు మహానాడు వేదికగా పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. మొదటి రోజు ఏకంగా రూ.21.53 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అలాగే పార్టీకి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఆన్‌లైన్‌లో కూడా విరాళాలు పంపవచ్చని సూచించారు. కార్యకర్తలే పార్టీని నడపాలని, విరాళాలు పార్టీ ఖర్చులకు పోగా మిగిలినవి కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు. ఈ మేరకు విరాళాలను తెలుగుదేశం బ్యాంకు ఖాతాకు పంపాలని కోరారు. ఆర్థికంగా కాస్త బలంగా ఉన్నవారు శక్తిమేర విరాళమిస్తే పార్టీకి ఖర్చు చేస్తామన్నారు. కడప టీడీపీ మహానాడు వేదికగా విరాళాలు ఇచ్చిన వారి వివరాలను చంద్రబాబు వెల్లడించారు. తొలిరోజు విరాళాలు ఇచ్చిన వారిలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. ఆయన ఏకంగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.5 కోట్లు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ రూ.1.16 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. మంత్రులు పి.నారాయణ, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున విరాళం అందజేశారు.
ఇది కూడా చదవండి: టీడీపీకి భారీ విరాళాన్ని అందించిన టాలీవుడ్ నిర్మాత! అతను ఎవరో తెలుసా..?
మంత్రులు సవిత (లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్) రూ.50 లక్షలు, కొండపల్లి శ్రీనివాస్ రూ.40 లక్షలు ఇచ్చారు. అలాగే టీడీపీ నేతలు భాష్యం రామకృష్ణ రూ. కోటి, గంగాప్రసాద్ రూ.50 లక్షలు విరాళాలు అందజేశారు. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాజగోపాల్ రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. 'ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, దామచర్ల జనార్దన్ రూ.25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ రూ.15 లక్షలు, పులివర్తి నాని రూ.10,00,116 విరాళం ఇచ్చారు. మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, దినేశ్‌రెడ్డి పోలంరెడ్డి, వేగేశ్న నరేంద్రవర్మ రూ.10 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. గద్దె రామ్మోహన్‌రావు రూ.2 లక్షలు, యనమల దివ్య రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు, వేమన సతీష్ రూ.25 లక్షలు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ రూ.25 లక్షలు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. అడుసుమల్లి రాధాకృష్ణ రూ.13 లక్షలు, డేగల ప్రభాకర్‌రావు రూ.10లక్షలు, కంది చంద్రశేఖర్‌రావు రూ.5,01,116, బాజీ చౌదరి రూ.5 లక్షలు, గోవిందరెడ్డి రూ.5 లక్షలు, గద్దె అనూరాధ రూ.2 లక్షలు, గద్దె పద్మావతి రూ.2 లక్షలు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రూ.1,00,116, మల్లెల రాజశేఖర్ రూ.లక్ష విరాళం ఇచ్చారు' అన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: