రాష్ట్రాభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చూపించినట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. “పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. ప్రజలు అన్నీ గమనిస్తారు.. జాగ్రత్తగా ఉండాలి గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు.
ఇది కూడా చదవండి: మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అసమర్థ పాలనతో ఏపీని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు ఉంటాయి. మంచి చేస్తే అభినందిస్తా.. తప్పు చేస్తే దూరం పెడతా. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదు. ఈ నెల 12 లేదా 14 లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తాం" చంద్రబాబు తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో ఏడాది పాలనపై 12న నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై ఇక్కడ చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: