బంగారం వినియోగంలో భారతదేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఏటా వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ దేశంలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తి (Gold Mining) చేయడంలో మాత్రం ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడి ఉంది. కానీ త్వరలో ఈ పరిస్థితి మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి గోల్డ్ మైన్‌లో వచ్చే సంవత్సరం నుంచి మైనింగ్ ప్రారంభం కానుంది. జియోమైసూర్ సర్వీసెస్‌తో కలిసి డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఈ గని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి జొన్నగిరి గోల్డ్ మైన్‌కు ‘కన్సెంట్ టు ఆపరేట్ (CTO)’ అనుమతి లభించింది. దీంతో గని, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నడపడానికి డెక్కన్ గోల్డ్ మైన్స్ రెడీగా ఉంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమా ప్రసాద్ మొదలి ప్రకారం.. ట్రయల్ రన్స్ కోసం కొన్ని నెలల టైమ్ పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టారు. పైలట్ స్కేల్ ఆపరేషన్‌లో నెలకు ఒక కిలో బంగారం ఉత్పత్తి అవుతోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ 2026 ఆర్థిక సంవత్సరం నుంచి 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయనుంది.
ఇది కూడా చదవండి: రెండ్రోజుల్లో RBI నుంచి అదిరే శుభవార్త.. భారీగా తగ్గనున్న లోన్ EMIలు? ఈసారి 75 పాయింట్లు కోత..
పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఏటా 750 కిలోల బంగారం తవ్వనున్నారు. ఈ గని భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత స్థాపించిన ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్. కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల సమీపంలో ఈ గని ఉంది. 2013లో మైనింగ్ లీజ్ పొందిన ఈ ప్రాజెక్ట్ దాదాపు 8-10 సంవత్సరాల పాటు ఎక్స్‌ప్లోరేషన్ ప్రిసెస్ పూర్తి చేసింది. ఈ గని ఓపెన్-పిట్ మైనింగ్ ద్వారా 6.8 టన్నుల బంగారాన్ని ఇవ్వగలదని జియోమైసూర్ అంచనా వేసింది. మొదటి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తితో (Gold Mining) రూ. 300-350 కోట్ల రెవెన్యూ వస్తుందని హనుమా ప్రసాద్ అంచనా వేశారు. 60% EBITDA మార్జిన్‌తో ఈ రెవెన్యూ 2027 ఆర్థిక సంవత్సరంలో సాధ్యమవుతుంది. ఈ బంగారాన్ని సమీపంలోని రిఫైనరీలకు అమ్ముతారు. భారత్ 2023-24లో 1341 కిలోల బంగారం ఉత్పత్తి చేసినట్లు ఒక రిపోర్ట్ తెలిపింది. జొన్నగిరి గనితో ఇది భారీగా పెరగనుంది.
ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
దిగుమతులపై ఆధారపడటం తగ్గించి.. దేశీయ ఉత్పత్తిని పెంచడంలో ఈ గని కీలక పాత్ర పోషించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అనుమతి ప్రకటనతో డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు 14.28% పెరిగి రూ. 170.50కి చేరాయి. 2024 ఆగస్టు 6 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఉదయం 10:17 గంటలకు షేర్లు 11.70% పెరిగి రూ. 166.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. గత 12 నెలల్లో 58.42% పెరిగాయి. ట్రేడింగ్ వాల్యూమ్ 30 రోజుల సగటు కంటే 13 రెట్లు ఎక్కువగా ఉంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 49.23 వద్ద ఉంది. భారతదేశంలో బంగారం తవ్వకం (Gold Mining) చారిత్రకంగా కర్ణాటకలోని కోలార్, హుట్టి గనులకు మాత్రమే పరిమితమైంది. ఇవి బ్రిటిష్ కాలంలో ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత పెద్దగా గనులు బయటపడలేదు. జొన్నగిరి గని 80 ఏళ్లలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌గా చరిత్ర సృష్టిస్తోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ 2003లో స్థాపించారు. ఇది ధార్వాడ్ క్రాటన్‌లోని గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లలో బంగారం నిక్షేపాలను కనిపెట్టింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: