తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. పార్టీలో ఇతరులను చేర్చుకునేముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పార్టీలోకి చేరదలుచుకున్న వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఆహ్వానించాలని సూచించారు. అలాగే, పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. పార్టీ శ్రేయస్సు, పరిమితుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పల్లా తెలిపారు.
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
.202506077345.jpg)