గుంటూరు నగరానికి త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం విద్యుత్ శాఖ అధికారులు రూ.6.39 కోట్ల వ్యయంతో చార్జింగ్ సదుపాయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించగా, ఢిల్లీ అధికారులు వాటిని పరిశీలించినట్లు సమాచారం.
బుడంపాడు విద్యుత్ కేంద్రం నుంచి 52 విద్యుత్ టవర్ల ద్వారా ప్రత్యేక లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన అనుమతులు త్వరలో మంజూరు కాగానే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు అమలుతో గుంటూరు నగరంలో పర్యావరణహిత, శుభ్రమైన బస్సు ప్రయాణానికి మరింత ఊతం లభించనుంది. ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.