ప్రముఖ నటి రాశీ ఖన్నా (Raashi Khanna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రశ్రేణి నటీమణిగా ఆమె పేరొందారు. దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆమెకు పవన్ కళ్యాణ్ (Pawan Klayan)తో కలిసి పనిచేసే అవకాశం దక్కకపోవడం విశేషం.
ఈ గ్యాప్‌ను కవర్ చేస్తూ, పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో ఎంపికయ్యారు. ఇప్పటికే ఈ చిత్రంలో శ్రీలీల (Srileela) ప్రధాన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాశీ ఖన్నా సెకండ్ లీడ్గా ఈ ప్రాజెక్టులో జాయిన్ కావడం, ఆమె అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన ఆమెకు ఇది ఓ కీలక మలుపుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో జరుగుతున్న చిత్రీకరణలో రాశీ ఖన్నా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆమె కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి హిట్ తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ (Y. Ravi Shankar) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.