పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సినిమాకి విడుదలైన పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.100గా, అప్పర్ క్లాస్ టికెట్‌ను రూ.150గా నిర్ణయించుకుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు రూ.200 వరకు ఉండేలా అనుమతి ఇచ్చింది.
అదేవిధంగా సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూలై 23న ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. అధికారికంగా 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
'పవన్ కళ్యాణ్' అభిమానులు భారీగా వేడుకలకు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొననున్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.