తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ (Singer Rahul Sipligunj)ను బోనాల పండుగ సందర్భంగా ఘనంగా సన్మానించింది. గాయకుడికి గౌరవార్థంగా రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించగా, ఈ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా అందజేశారు. యువతలో ప్రజాదరణ పొందిన రాహుల్ ప్రతిభను ప్రశంసిస్తూ సీఎం మాట్లాడుతూ, “రాహుల్ వంటి ప్రతిభావంతులు తెలంగాణ మట్టిలో పుట్టిన గొప్ప సంపద” అని అన్నారు.

ఇటీవల జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల (Gaddar Film Awards) కార్యక్రమంలో కూడా రాహుల్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఆయన ప్రతిభను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయనకు ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘నాటు నాటు’ పాటలో రాహుల్ గానం చేసిన పాదాలు ప్రపంచ మ్యూజిక్ ప్రియులకు మేటిగా నిలిచాయి. 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల (Academy Awards) వేడుకలో ఈ పాట ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. తన కృషి, సంకల్పంతో ప్రపంచ వేదికపై నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రభుత్వం ఈ అవార్డుతో మరింతగా గౌరవించింది.