ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) మద్యం కుంభకోణం కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) పార్లమెంటరీ నాయకుడు, (Rajampet MP Mithun Reddy)ని శనివారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనను, సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టుకు హాజరు చేసేందుకు ముందు, ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు మిథున్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బీపీ (BP), షుగర్ (Sugar), ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలుండకపోవటాన్ని ధృవీకరించడంతో, వెంటనే కోర్టుకు తరలించారు.
ఈ కేసులో మిథున్ రెడ్డి మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు సిట్ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం సుమారు ఏడు గంటల పాటు విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు మిథున్ రెడ్డి హైకోర్టు (High Court) మరియు సుప్రీం కోర్టు (Supreme Court)ల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినా, రెండు కోర్టులు తిరస్కరించడంతో ఆయనపై అరెస్టు వేటు పడింది.
ఇదిలా ఉండగా, సిట్ అధికారులు ఆయనపై రిమాండ్ (Remand) విధించాలంటూ కోర్టులో వినతిపత్రం సమర్పించనున్నారు. మద్యం స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై SIT దర్యాప్తు వేగవంతం చేస్తోంది.