ఆధార్ కార్డు భారతీయుల ప్రధాన గుర్తింపు కార్డులలో ఒకటి. కానీ ఆధార్ పౌరసత్వానికి ([citizenship]) రుజువు కాదు. ఆధార్ కార్డుతో పాటు పౌరసత్వ అంశాన్ని కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు ([Supreme Court]) ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ ఈలోగా, UIDAI దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
పిల్లలకు ఏడు సంవత్సరాలు నిండినప్పుడు ఆధార్ కార్డులను అప్‌డేట్ ([update]) చేయాలని UIDAI సూచించింది. అప్‌డేట్ కాని పిల్లలు తమ బయోమెట్రిక్‌లు ([biometrics]) అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలంటే ఇంట్లో చేసుకోలేని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ([Ministry of Electronics and Information Technology]) చెబుతోంది. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఏదైనా ఆధార్ సేవా కేంద్రాన్ని ([Aadhaar Seva Kendra]) సందర్శించాలని సూచిస్తోంది. అందుకే ఆధార్ అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కేంద్రాన్ని సందర్శించే చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అయితే ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని UIDAI సూచిస్తోంది. వివరాలు అప్‌డేట్ చేసుకోవడం వల్ల మోసాలను ([frauds]) నివారించవచ్చని చెబుతోంది.
అయితే, మీ ఇంటికి సమీపంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ([Aadhaar Enrolment Centre]) లేదా ఆధార్ సర్వీస్ సెంటర్ ([Aadhaar Service Centre]) ఎక్కడ ఉందో చూడటానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ([UIDAI]) వెబ్‌సైట్‌ను ([website]) సందర్శించండి. అక్కడ, ‘లొకేట్ ఎన్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్’ ([Locate an Enrolment Centre]) ఆప్షన్‌కి వెళ్లి, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మీ రాష్ట్రం, నగరం పేరును నమోదు చేయండి. ఈ విధంగా మీరు మీ ఆధార్ బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసుకోవచ్చు.