Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..! అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..! అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

Space Technology: గాలి నుంచీ ఆహారం… మూత్రం నుంచీ ప్రోటీన్! అంతరిక్షంలో మనిషి జీవితం’కి ESA కొత్త చరిత్ర!!

2025-11-11 09:18:00
BSNL ఫ్రీడమ్ ఆఫర్! రూ.1కే నెలరోజుల అన్‌లిమిటెడ్ సేవలు!

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అంతరిక్ష ప్రయాణాల్లో అత్యంత పెద్ద సమస్య అయిన ఆహార సరఫరాకు వినూత్న పరిష్కారం కనుగొనే దిశగా కీలక ప్రయత్నం ప్రారంభించింది. దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో లేదా చంద్రుడు, మార్స్ పై భవిష్యత్తులో  అక్కడే ఆహారం ఉత్పత్తి చేసే వ్యవస్థ అవసరం అనే భావనతో ESA "HOBI-WAN" అనే ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో అంతరిక్షంలో అందుబాటులో ఉండే గాలి, నీరు, విద్యుత్ మరియు అస్ట్రోనాటు మూత్రంలో ఉన్న యూరియా ఉపయోగించి ప్రోటీన్‌ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ఈ ప్రయోగంలో ఫిన్లాండ్‌కు చెందిన Solar Foods అనే కంపెనీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారు ఇప్పటికే భూమిపైనే “Solein” అనే ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేశారు. ఇది గాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మజీవులు మరియు విద్యుత్‌ సహాయంతో తయారయ్యే పదార్థం. భూమిపై ఈ ప్రక్రియలో నైట్రోజన్ కోసం అమోనియాను ఉపయోగిస్తారు. అయితే అంతరిక్షంలో అమోనియా అందుబాటులో ఉండదని, అందుకు ప్రత్యామ్నాయంగా మూత్రంలో ఉండే యూరియాను నైట్రోజన్ మూలంగా వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే ఆలోచనను ఇప్పుడు అంతరిక్షంలో పరీక్షించడానికి ESA సిద్ధమవుతోంది.

Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే!

ESA చీఫ్ ఎక్స్‌ప్లోరేషన్ సైంటిస్ట్ అంజెలిక్ వాన్ ఒంబెర్గెన్ మాట్లాడుతూ, దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు స్వయం సమృద్ధి అత్యంత ముఖ్యమని తెలిపారు. చంద్రుడు లేదా మంగళగ్రహం వంటి ప్రదేశాలలో మనుషులు నివసించగలగాలంటే, అక్కడే ఆహారం, నీరు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉండాలి. భూమి నుండి వరుసగా రవాణా చేయడం ఖరీదైనదే కాకుండా ప్రమాదకరమని కూడా వారు స్పష్టం చేశారు. అందుకే వ్యర్థ పదార్థాలను కూడా ఉపయోగించి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే ఈ ప్రయోగం భవిష్యత్తు అంతరిక్ష జీవనానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.

రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!

అయితే ఈ ప్రక్రియ అంతరిక్షంలో భూమిమీదలానే పని చేస్తుందా లేదా అన్నది ఇప్పటివరకు  స్పష్టంగా లేదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల ద్రవాలు మరియు వాయువుల ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సూక్ష్మజీవుల పెరుగుదలపై, పోషక ద్రవాలు వాటికి చేరే విధానంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఈ వ్యవస్థను సురక్షితంగా, శుభ్రంగా నిర్వహించడం మరో పెద్ద సవాలు అని Solar Foods సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టు లూకాడెన్ తెలిపారు. తయారయ్యే ఆహారం astronauts ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితమా? పౌష్టిక విలువలు పక్కాగా కలిగి ఉందా? అన్నవి పరీక్షల్లో నిరూపించాలి.

హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం! తప్పిన పెను ప్రమాదం!

ఈ ప్రయోగం విజయవంతమైతే, అంతరిక్ష ప్రయాణాలకు ఆహారం రవాణా చేసే అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. చంద్రుడు లేదా మంగళంపై ఉన్న కాలనీలు బయట సహాయం లేకుండానే ఆహారం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టెక్నాలజీ భవిష్యత్తులో భూమిపై కూడా ఆహార కొరత సమస్యలకు పరిష్కారం తీసుకురాగలదు. వాతావరణ పరిస్థితులు, సాగు భూమి లోపం వంటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో గాలి, విద్యుత్ సహాయంతో ప్రోటీన్ తయారీ ఒక విప్లవం కావచ్చు.

Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!!

మొత్తం మీద ESA చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్షంలోని జీవితానికి కాలనీలకు మరియు భవిష్యత్తు మానవ జీవన విధానానికి ఓ మార్గదర్శకమైన అంశంగా నిలుస్తోంది. గాలి నుంచి ఆహారం, వ్యర్థ మూత్రం నుంచి ప్రోటీన్ ఉత్పత్తి చేయడం  ఇవి వినడానికి వింతగా అనిపించినా ఇవే రాబోయే తరాల అంతరిక్ష జీవనానికి పునాది వేయనున్నాయి.

Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!
ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి..
Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!
Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57!
భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ!
గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం!

Spotlight

Read More →