అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లే అయినప్పటికీ, వీటిని ఒకేసారి కలిపి తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి పండు తనదైన గుణం, దోషం కలిగి ఉంటుంది. అందుకే విభిన్న స్వభావం కలిగిన పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని వారు చెబుతున్నారు.
అరటిపండులో పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కండరాలకు బలాన్ని ఇస్తాయి. బొప్పాయి పండులో ఉండే ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి. ఈ రెండు పండ్లు విడివిడిగా తినడం శరీరానికి మంచిదే కానీ కలిపి తినడం ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అరటిపండు చల్లని స్వభావం కలిగినది కాగా, బొప్పాయి వేడిని పెంచే స్వభావం కలిగి ఉంటుంది. ఈ రెండు విరుద్ధ గుణాలున్న పండ్లను కలిపి తినడం వల్ల శరీర తాపం అసమతుల్యం అవుతుంది. దీని వల్ల వాంతులు, తలనొప్పి, తల తిరగడం, అలర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.
అంతేకాకుండా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను కలిపి తినడం వల్ల ఉబ్బసం లేదా ఇతర శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాక, శరీరంలో విషతత్వాలు పేరుకునే అవకాశం ఉంటుంది.
అందువల్ల, బొప్పాయి మరియు అరటిపండ్లను విడివిడిగా తినడం ఉత్తమం. అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తే, బొప్పాయి వేడిని పెంచుతుంది. ఒకేసారి వీటిని తీసుకోవడం శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, పండ్లను తినేటప్పుడు వాటి స్వభావం, ప్రభావం దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.