Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి!

Dairy Free Diet: డైరీ ఉత్పత్తులకు బ్రేక్ ఇస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Dairy Free Diet: రెండు వారాల పాటు పాలు ఇతర డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? జీర్ణక్రియ మెరుగుపడుతుందా చర్మం మెరుస్తుందా? నిపుణులు చెబుతున్న వాస్తవాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Published : 2026-04-07 13:48:00

Dairy Free Diet: మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఏదో ఒక రూపంలో పాలను వాడుతూనే ఉంటాం. ఉదయం టీ, కాఫీలు.. మధ్యాహ్నం భోజనంలో పెరుగు.. ఇలా పాలు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే, ఇటీవల కాలంలో చాలామంది 'వీగన్' డైట్ వైపు మొగ్గు చూపుతూ, పాలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. మరి కేవలం రెండు వారాల పాటు పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులను మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారో  తెలుసుకోండి.

మనలో చాలామందికి పాలు తాగినప్పుడు కడుపులో గ్యాస్ లేదా ఉబ్బరంగా అనిపిస్తుంది. దీనికి కారణం 'లాక్టోస్ ఇన్ టాలరెన్స్'. అంటే పాలలోని చక్కెరను మన శరీరం అరిగించుకోలేకపోవడం. మీరు రెండు వారాల పాటు పాలను దూరం పెడితే, జీర్ణక్రియ మెరుగుపడి కడుపు తేలికగా అనిపిస్తుంది. గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

కొంతమందిలో పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు రెండు వారాల పాటు డైరీకి దూరంగా ఉంటే, మీ చర్మం మృదువుగా మారి, మొటిమల సమస్య తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు.పాలు మన ఎముకలకు బలాన్నిచ్చే క్యాల్షియానికి ప్రధాన వనరు. మీరు పాలు మానేసినప్పుడు శరీరానికి అందాల్సిన క్యాల్షియం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే పాలకు బదులుగా రాగులు, నువ్వులు, బాదం, ఆకుకూరలు వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. లేదంటే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది.

మార్కెట్లో దొరికే చాలా పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి కలుపుతుంటారు. ఇది మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పాలు మానేసినప్పుడు ఎండలో కాసేపు గడపడం లేదా విటమిన్ డి ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మనం రోజూ తినే పెరుగులో మన పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. పాలు, పెరుగు మానేసినప్పుడు ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియలో మార్పులు రావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పులియబెట్టిన పదార్థాలు తీసుకోవడం మంచిది.

రెండు వారాల పాటు పాలు మానేయడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరికినట్లు అనిపించినా, మీ శరీరానికి కావలసిన పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం. ఏదైనా కొత్త డైట్ మొదలుపెట్టే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. పాలు మానేయడం అనేది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరికి ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తే, మరికొందరికి నీరసాన్ని కలిగించవచ్చు. 

Spotlight

Read More →