LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Health

Telugu Health News: విటమిన్ 'కె'ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే!

Vitamin K Deficiency: శరీరంలో విటమిన్ 'కె' తగ్గితే రక్తం గడ్డకట్టదు, ఎముకలు బలహీనపడతాయి. విటమిన్ కె లోపం వల్ల కలిగే ప్రధాన లక్షణాలు, అది మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మరియు ఏ ఆహార పదార్థాల ద్వారా దీనిని భర్తీ చేయవచ్చో తెలుసుకోండి..

AndhraPravasi News Desk 2 min read
Telugu Health News: విటమిన్ 'కె'ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే!

Vitamin K Deficiency: మన ఆరోగ్యం విషయంలో విటమిన్ సి, విటమిన్ డి గురించి ఉన్నంత అవగాహన విటమిన్ 'కె'  మీద ఉండదు. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ, శరీరం సాఫీగా సాగాలన్నా, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలబడాలన్నా ఈ విటమిన్ అత్యంత కీలకం. రక్తం గడ్డకట్టడం నుంచి ఎముకల గట్టిదనం వరకు ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి ఈ కీలక పోషకం మన శరీరంలో తగ్గిపోతే వచ్చే సంకేతాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు..

విటమిన్ 'కె' ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఆకుకూరల్లో లభించేది K1 అయితే, జంతు సంబంధిత ఆహారం  పులియబెట్టిన పదార్థాల్లో దొరికేది K2. మనకు ఎక్కడైనా చిన్న గాయం అయినప్పుడు రక్తం వెంటనే గడ్డకట్టడానికి K1 సహాయపడుతుంది. ఒకవేళ ఇది లేకపోతే రక్తం ఆగకుండా కారిపోయి ప్రాణాపాయం కలగొచ్చు. ఇక K2 విషయానికి వస్తే, ఇది శరీరంలోని కాల్షియంను సరిగ్గా ఎముకలకు చేరవేస్తుంది. ఇది లేకపోతే కాల్షియం రక్త నాళాల్లో పేరుకుపోయి గుండె సమస్యలకు దారితీస్తుంది.

లోపం ఉందని చెప్పే ముఖ్య లక్షణాలు ఇవే..

ఆగని రక్తస్రావం: సాధారణంగా చిన్న దెబ్బ తగిలితే నిమిషాల్లో రక్తం ఆగిపోవాలి. కానీ విటమిన్ కె లోపం ఉంటే గడ్డకట్టే ప్రక్రియ ఆలస్యమవుతుంది. షేవింగ్ చేసుకున్నప్పుడు లేదా చిన్న కోత పడినా రక్తం ధారగా కారుతుంటే అది విటమిన్ లోపమే కావచ్చు.

చిగుళ్ల నుండి రక్తం కారడం: బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టిగా ఏదైనా తిన్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే దానిని కేవలం పంటి సమస్యగా భావించకండి. రక్త నాళాలు బలహీనపడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అలాగే ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం కారడం కూడా ఒక హెచ్చరికగా భావించాలి.

చర్మంపై నల్లటి మచ్చలు: శరీరానికి ఎక్కడైనా చిన్న తగిలినా వెంటనే ఆ ప్రాంతంలో చర్మం నీలం లేదా నలుపు రంగులోకి మారిపోతుంటే జాగ్రత్త పడాలి. లోపల రక్తనాళాలు చిట్లి రక్తం పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే మనం 'కమిలిపోవడం' అంటాం.

ఎముకల బలహీనత: వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు రావడం, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరగడం వంటివి విటమిన్ కె-2 లోపానికి నిదర్శనం. కాల్షియం శరీరంలో ఉన్నా, దానిని ఎముకలు గ్రహించాలంటే ఈ విటమిన్ తోడుండాల్సిందే.

మహిళల్లో నెలసరి సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడం, మలమూత్ర విసర్జనలో రక్తం చారలు కనిపించడం వంటివి జరిగితే వెంటనే అలర్ట్ కావాలి. ఇది శరీరంలో అంతర్గత రక్తస్రావానికి సంకేతం కావచ్చు. విటమిన్ 'కె' లోపాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఈ విటమిన్‌కు పెట్టింది పేరు. గుడ్లు, చేపలు, కాలేయం  వంటి వాటిలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమ ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Be the first to react

More Coverage