ఏం టెక్నాలజీ రా బాబు! స్మార్ట్‌ఫోన్‌తో కంటిశుక్లాలను గుర్తించవచ్చా...
Smartphone Eye Screening:కంటిశుక్లం (క్యాటరాక్ట్), రెక్కల వంటి కంటి పెరుగుదల (ప్యాటరీజియం) తదితర సమస్యలను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాంకేతికత కొత్త అవకాశాలను తెరుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన కంటి చిత్రాలను దూరం నుంచి పరిశీలించిన నేత్ర వైద్యులు చేసిన రిఫరల్ నిర్ణయాలు, అదే సమయంలో రోగులను ప్రత్యక్షంగా పరీక్షించిన వైద్యుల నిర్ణయాలతో అధిక స్థాయిలో సరిపోలినట్లు పరిశోధకులు వెల్లడించారు.
- క్యాటరాక్ట్, ప్యాటరీజియం తదితర కంటి సమస్యల ప్రాథమిక స్క్రీనింగ్‌కు అవకాశం.
- వైద్య నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ప్రాథమిక స్క్రీనింగ్‌కు అవకాశం.. 1,093 మందిపై అధ్యయనం.
- తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్న ప్రాంతాల్లోనూ పనిచేసే టెలిమెడిసిన్ యాప్‌తో అనుసంధానం.
Smartphone Eye Screening: కంటిశుక్లం (క్యాటరాక్ట్), రెక్కల వంటి కంటి పెరుగుదల (ప్యాటరీజియం) తదితర సమస్యలను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాంకేతికత కొత్త అవకాశాలను తెరుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన కంటి చిత్రాలను దూరం నుంచి పరిశీలించిన నేత్ర వైద్యులు చేసిన రిఫరల్ నిర్ణయాలు, అదే సమయంలో రోగులను ప్రత్యక్షంగా పరీక్షించిన వైద్యుల నిర్ణయాలతో అధిక స్థాయిలో సరిపోలినట్లు పరిశోధకులు వెల్లడించారు.:కంటిశుక్లం (క్యాటరాక్ట్), రెక్కల వంటి కంటి పెరుగుదల (ప్యాటరీజియం) తదితర సమస్యలను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాంకేతికత కొత్త అవకాశాలను తెరుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన కంటి చిత్రాలను దూరం నుంచి పరిశీలించిన నేత్ర వైద్యులు చేసిన రిఫరల్ నిర్ణయాలు, అదే సమయంలో రోగులను ప్రత్యక్షంగా పరీక్షించిన వైద్యుల నిర్ణయాలతో అధిక స్థాయిలో సరిపోలినట్లు పరిశోధకులు వెల్లడించారు.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS) 44వ కాంగ్రెస్‌లో అరవింద్ ఐ హాస్పిటల్, మదురైకి చెందిన వైద్య అధికారి డాక్టర్ ప్రభు కృష్ణ రవిల్లా ఈ అధ్యయన వివరాలను వెల్లడించారు. భౌగోళిక దూరం, వృద్ధాప్యం, అనారోగ్యం వంటి కారణాలతో నేత్ర వైద్యులను సంప్రదించలేని గ్రామీణ ప్రజలకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
96 శాతం నిర్ణయాల్లో ఏకాభిప్రాయం
తమ అధ్యయనంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కేవలం మూడు గంటల శిక్షణ ఇచ్చి.. తమిళనాడులోని పుదుచ్చేరి సమీపంలోని ఐదు పట్టణాల పరిధిలో 19 గ్రామీణ కంటి శిబిరాలు నిర్వహించారు. మొత్తం 1,093 మందికి స్మార్ట్‌ఫోన్ ఆధారిత కంటి స్క్రీనింగ్ చేశారు.
చెంగం, తిరువణ్ణామలై, చెయ్యార్, ఆరణి, కడలూరు ప్రాంతాల పరిసర గ్రామాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు తీసిన కంటి చిత్రాలను నేత్ర వైద్యులు దూరం నుంచి పరిశీలించి రోగులను తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి పంపాలా లేదా అన్నది నిర్ణయించారు. ఇదే సమయంలో శిబిరంలో ప్రత్యక్షంగా ఉన్న నేత్ర వైద్యుల నిర్ణయాలతో వాటిని పోల్చారు.
ఈ రెండు విధానాల మధ్య రిఫరల్ నిర్ణయాల్లో 96 శాతం కేసుల్లో ఏకాభిప్రాయం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
కంటిశుక్లం గుర్తింపులోనూ మెరుగైన ఫలితాలు
కంటిశుక్లం ఉందా లేదా అనే విషయంలో వైద్యుల మధ్య 89 శాతం వరకు Agreement నమోదైంది. మెచ్యూర్ క్యాటరాక్ట్ గుర్తింపులో 96 శాతం, ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్‌లో 85 శాతం, కంటి లెన్స్ స్పష్టంగా ఉన్న కేసుల్లో 89 శాతం, ఇప్పటికే కృత్రిమ లెన్స్ అమర్చిన కళ్లను గుర్తించడంలో 97 శాతం ఏకాభిప్రాయం నమోదైంది.
ప్యాటరీజియం గుర్తింపులోనూ 94 శాతం వరకు వైద్యుల నిర్ణయాలు సరిపోలినట్లు అధ్యయనం వెల్లడించింది.
కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు శిక్షణ పొందిన తర్వాత ఒక్కో కంటిని రెండున్నర నిమిషాల్లోపు స్క్రీన్ చేయగలిగారని పరిశోధకులు తెలిపారు. చిత్రాల నాణ్యత మెరుగ్గా ఉన్న కొద్దీ దూరం నుంచి పరిశీలించిన వైద్యులు, ప్రత్యక్షంగా పరీక్షించిన వైద్యుల మధ్య ఏకాభిప్రాయం కూడా పెరిగినట్లు గుర్తించారు.
ఫోన్‌కు అమర్చే చిన్న పరికరం
ఈ సాంకేతికత కోసం పరిశోధకులు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చుకునే చిన్న, పోర్టబుల్ పరికరాన్ని రూపొందించారు. కంటి ముందు భాగాన్ని పెద్దగా చూపించే లెన్స్, ఫోన్ నుంచి విద్యుత్ పొందే రెండు చిన్న LED లైట్లు ఇందులో ఉంటాయి. కంటి చుట్టూ సౌకర్యంగా అమరే సిలికాన్ స్కోప్ ద్వారా బయటి వెలుతురు అడ్డుకోవడంతో పాటు.. కంటికి కెమెరా మధ్య దూరాన్ని స్థిరంగా ఉంచేలా దీనిని రూపొందించారు.
భారత్‌లోనే తయారవుతున్న ఈ పరికరం ఫోన్‌తో కలిపి £150 కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్న ప్రాంతాల్లోనూ పనిచేసే టెలిమెడిసిన్ యాప్‌తో దీనిని అనుసంధానించారు. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లిష్, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు ఊతం
క్యాటరాక్ట్ ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ముఖ్యంగా వైద్య నిపుణుల సేవలు పరిమితంగా ఉన్న తక్కువ వనరుల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రవిల్లా తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా నిర్వహించే కంటి శిబిరాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. నిపుణుల లభ్యత, ప్రయాణం, నిర్వహణ వ్యయం వంటి అంశాల కారణంగా అన్ని అవసరమైన ప్రజలకు శిబిరాల ద్వారా పరీక్షలు అందడం కష్టమవుతోంది. గతంలో అరవింద్ ఐ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతంలోని గ్రామీణ జనాభాలో కేవలం 7 శాతం మందే కంటి శిబిరాలకు హాజరయ్యారు. శిబిరం నుంచి మూడు కిలోమీటర్లకు పైగా దూరంలో నివసించే వారి హాజరు 80 శాతం వరకు తగ్గింది.
స్మార్ట్‌ఫోన్ ఆధారిత విధానం అందుబాటులోకి వస్తే.. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు ప్రజల వద్దకే వెళ్లి ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. అనంతరం అవసరమైన కేసులను నేత్ర వైద్యులు దూరం నుంచే పరిశీలించి తదుపరి చికిత్సకు సూచించవచ్చు.
పూర్తి నేత్ర పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు
అయితే ఈ సాంకేతికతను ప్రస్తుత దశలో పూర్తి స్థాయి నేత్ర వైద్య పరీక్షకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని పరిశోధకులు స్పష్టం చేశారు. స్లిట్ ల్యాంప్ వంటి మరింత కచ్చితమైన పరికరాలతో నిర్వహించే సమగ్ర కంటి పరీక్షలతో ఈ విధానాన్ని ఇంకా విస్తృతంగా పోల్చాల్సి ఉందని తెలిపారు.
ప్యాటరీజియం, రిఫ్రాక్టివ్ లోపాలు, కార్నియల్ ఒపాసిటీ వంటి లెన్స్‌కు సంబంధం లేని కొన్ని కంటి సమస్యలను గుర్తించడంలో ఈ ప్లాట్‌ఫామ్ పనితీరు తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా పరీక్షించిన వైద్యులు కంటి పాపలను విస్తరించిన తర్వాత పరీక్షించగా.. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మాత్రం పాపలు విస్తరించకముందే చిత్రాలను తీసిన విషయం కూడా ఫలితాలపై ప్రభావం చూపి ఉండవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఏఐతో అనుసంధానం
ఇక భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరింత మెరుగుపరిచేందుకు పరిశోధకులు పలు చర్యలు చేపట్టనున్నారు. స్లిట్-బీమ్, బ్లూ-లైట్, డైలేటెడ్-ఐ చిత్రాలను కూడా జోడించి కంటి వ్యాధుల గుర్తింపు సామర్థ్యాన్ని పెంచే దిశగా పరిశోధనలు కొనసాగనున్నాయి.
అదే సమయంలో ఏఐ ఆధారిత క్యాటరాక్ట్ గ్రేడింగ్ను కూడా పరిశీలించనున్నారు. దీంతో ప్రారంభ దశలోనే అనుమానాస్పద కేసులను గుర్తించి.. అవసరమైన వాటిని నేత్ర వైద్యుల పరిశీలనకు పంపే విధానం మరింత వేగవంతం కావచ్చని భావిస్తున్నారు.
ఈ అధ్యయనం అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, భారతదేశంలోని అరవింద్ ఐ కేర్ సిస్టమ్ సహకారంతో జరిగింది. అయితే ప్రస్తుత ఫలితాలను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేయడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
ESCRS అధ్యక్షుడు, జర్మనీలోని యూనివర్సిటీ ఐ హాస్పిటల్ బోఖుమ్‌కు చెందిన ప్రొఫెసర్ బుర్ఖార్డ్ డిక్ కూడా ఈ విధానాన్ని ఆశాజనకంగా అభివర్ణించారు. అయితే ఇది సమగ్ర నేత్ర వైద్య పరీక్షకు ప్రత్యామ్నాయం కాదని, జాగ్రత్తగా పర్యవేక్షించే స్క్రీనింగ్, ట్రయాజ్ సాధనంగా ఉపయోగిస్తే మారుమూల ప్రాంతాల్లోని మరింత మంది ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయగలదని ఆయన పేర్కొన్నారు.
Tags
Be the first to react