Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి!

Papaya Benefits: పచ్చి పప్పాయి vs పండు పప్పాయి: షుగర్ పేషెంట్లకు ఏది 'సూపర్ ఫుడ్'?

Papaya Benefits: డయాబెటిస్ ఉన్నవారు పప్పాయి తినవచ్చా? పచ్చి పప్పాయి పండు పప్పాయిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి దేనికి ఎక్కువగా ఉంది వీటిలోని గ్లైసీమిక్ ఇండెక్స్ పోషక విలువల..

Published : 2026-04-08 18:52:00

Papaya Benefits: డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఏది తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా పండ్ల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. పప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు, కానీ షుగర్ ఉన్నవారు పచ్చి పప్పాయి తినాలా లేక బాగా పండిన పండు తినాలా అన్నది పెద్ద ప్రశ్న. తాజా పరిశోధనల ప్రకారం, ఈ రెండింటిలో పచ్చి పప్పాయి డయాబెటిక్ రోగులకు ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి.

పచ్చి పప్పాయిలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇందులో పీచు పదార్థం  అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పచ్చి పప్పాయిని కూరలాగానో లేదా సలాడ్లలోనో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా రక్షణగా ఉంటుంది. పచ్చి దానితో పోలిస్తే పండులో సహజ చక్కెరలు  ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా తినాల్సిన పండు.

మరి పప్పాయి పండు అస్సలు తినకూడదా అంటే.. ఖచ్చితంగా తినవచ్చు... పప్పాయి పండులో విటమిన్-సి, విటమిన్-ఏ  పొటాషియం వంటి ముఖ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవారు పండును తినేటప్పుడు పరిమితి పాటించాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా, చిన్న కప్పుతో తీసుకోవడం మంచిది. అలాగే బాగా ముగ్గిపోయిన పండు కంటే దోరగా ఉన్న పండును ఎంచుకోవడం ఉత్తమం. పండును నేరుగా తినడం కంటే, దానితో పాటు కొద్దిగా బాదం లేదా వేరుశనగలు వంటి ప్రొటీన్ ఆహారాన్ని జత చేస్తే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చాలామంది పప్పాయిని జ్యూస్ రూపంలో తాగడానికి ఇష్టపడతారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు జ్యూస్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. జ్యూస్ చేసినప్పుడు పండులోని పీచు పదార్థం పోతుంది, దీనివల్ల షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. పచ్చి పప్పాయిని కూరగా వండుకుని తినడం లేదా సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫోలేట్, మెగ్నీషియం అందుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా పచ్చి పప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.

 షుగర్ వ్యాధిగ్రస్తులకు పచ్చి పప్పాయి ఒక 'సూపర్ ఫుడ్' లాంటిది. రోజూవారీ ఆహారంలో పచ్చి పప్పాయిని భాగంగా చేసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. పండు తినాలనిపిస్తే మాత్రం తక్కువ మొత్తంలో అది డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది. గర్భిణీలు మాత్రం పచ్చి పప్పాయి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సరైన పద్ధతిలో ఆహారాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య రీత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది సుమీ.

Spotlight

Read More →