Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Coffee: ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా? నిపుణుల హెచ్చరిక! High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Coffee: ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా? నిపుణుల హెచ్చరిక! High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..!

Menstrual Health: నెలసరి ఆలస్యమవుతోందా? అయితే ఈ 5 విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Menstrual Health: నెలసరి ఆలస్యం కావడానికి కేవలం హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కారణం కాదు. అధిక ఒత్తిడి, మితిమీరిన వ్యాయామం, మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా రుతుచక్రం తప్పుతుంది. పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి నిపుణులు సూచిస్తున్న కీలకమైన చిట్కాలు..

Published : 2026-03-04 14:52:00

Menstrual Health: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళల ఆరోగ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 'నెలసరి'  విషయంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు అనేకమందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రుతుచక్రం  ఒకరోజు రెండు రోజులు  అటు ఇటు అవ్వడం సాధారణమే అయినప్పటికీ, ప్రతిసారీ ఆలస్యమవుతుంటే మాత్రం అది కేవలం హార్మోన్ల సమస్యే అని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు ఈ సమస్యకు మూలకారణమవుతున్నాయి.

నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి లేని మనిషి లేరు. అయితే, మహిళల్లో అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ప్రత్యుత్పత్తికి కీలకమైన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా అండం విడుదల కావడంలో ఆలస్యమై, నెలసరి క్రమం తప్పుతుంది. అందుకే, పిరియడ్స్ సరిగా లేనప్పుడు ముందుగా మీ మానసిక ప్రశాంతత గురించి ఆలోచించాలి.

త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు కఠినమైన వ్యాయామాలు  చేస్తుంటారు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పడి, నెలసరి ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు సరైన పోషకాహారం తీసుకోకుండా 'క్రాష్ డైటింగ్' చేయడం వల్ల శరీరంలో కొవ్వు శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని నిలిపివేసి, ఇర్రెగ్యులర్ పిరియడ్స్‌కు దారితీస్తుంది.

రాత్రి వేళల్లో తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని 'సర్కాడియన్ రిథమ్'  దెబ్బతింటుంది. షిఫ్టుల వారీగా పనిచేసే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేనప్పుడు పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర హార్మోన్ల క్రమబద్ధీకరణకు ఎంతో అవసరం.

మీరు ఇతర ఆరోగ్య సమస్యల కోసం వాడుతున్న మందులు కూడా నెలసరిపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్, గర్భ నిరోధక మాత్రలు, డిప్రెషన్ తగ్గించే మందులు లేదా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల రుతుచక్రంలో మార్పులు సంభవిస్తాయి. ఏదైనా కొత్త మందులు వాడటం ప్రారంభించినప్పుడు నెలసరిలో మార్పులు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ  సమాచారం కేవలం మీ ఆవాహనకు మాత్రమే  ముందుగా మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. 

Spotlight

Read More →