Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం!

Anger Management Tips: ఆవేశం వద్దు.. ఆలోచన ముద్దు... కోపాన్ని తగ్గించుకుని మనశ్శాంతిని పొందే మార్గాలు ఇవే!

Anger Management Tips: జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకోండి. భావోద్వేగ స్థిరత్వం ద్వారా మీ బంధాలను ఎలా కాపాడుకోవచ్చో మానసిక ప్రశాంతతను ఎలా పొందాలో తెలుసుకోండి...

Published : 2026-03-14 10:53:00

Anger Management Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా త్వరగా దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఆవేశపడటం, ఎదుటివారిపై అరిచేయడం వల్ల ఎంతో కాలంగా ఉన్న అనుబంధాలు ఒక్క క్షణంలో ముక్కలైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'భావోద్వేగ స్థిరత్వం' అనేది చాలా ముఖ్యం. అసలు కష్ట సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి? మనసును, శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో  తెలుసుకుందాం.

సాధారణంగా మనకు ఇష్టమైన వారితో ఏదైనా గొడవ జరిగినప్పుడు లేదా విబేధాలు వచ్చినప్పుడు చాలా మంది ఆ చర్చల నుండి పారిపోవాలని చూస్తారు. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు అలా చేయరు. వారు సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వారు గెలవాలని ప్రయత్నించరు, బంధాన్ని నిలబెట్టుకోవాలని చూస్తారు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం వీరి ప్రధాన లక్షణం.

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ముందుగా మన శారీరక స్థితిని గమనించాలి. కోపం వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం సహజం. అలాంటప్పుడు మొండిగా వాదనకు దిగకుండా, కొద్దిసేపు ప్రశాంతంగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. శరీరాన్ని బిగుతుగా ఉంచకుండా వదులుగా వదిలేయాలి. మన స్వరం పెరగకుండా చూసుకున్నప్పుడే అవతలి వ్యక్తికి మనం చెప్పేది అర్థమవుతుంది. ఆవేశంలో మాట్లాడే ఏ మాట కూడా సమస్యను పరిష్కరించదు సదా గుర్తుంచుకోవాలి.

చాలా మంది గొడవ జరిగినప్పుడు ఎదుటివారిపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తారు. "నీ వల్లే ఇలా జరిగింది", "నువ్వు ఎప్పుడూ ఇంతే" వంటి మాటలు అనడం వల్ల గొడవ ఇంకా పెరుగుతుంది. కానీ భావోద్వేగ స్థిరత్వం ఉన్నవారు తమ భావాలను పంచుకుంటారు. "నువ్వు అలా అన్నప్పుడు నాకు బాధ కలిగింది" అని చెప్పడం వల్ల అవతలి వ్యక్తి కూడా ఆలోచనలో పడతారు. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కంటే, మనకు కలిగిన అనుభవాన్ని వివరించడం వల్ల చర్చ గొడవగా మారకుండా సజావుగా సాగుతుంది.

మానసిక ప్రశాంతత అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల మెప్పు కోసం కాకుండా, మన ఆనందం కోసం బంధాలను కాపాడుకోవాలి. ఒత్తిడి పెరిగినప్పుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించడం లేదా నచ్చిన పని చేయడం వల్ల మనసు కుదుటపడుతుంది. ఎదుటివారి పరిస్థితిని కూడా సానుభూతితో అర్థం చేసుకున్నప్పుడు మనలో కోపం తగ్గి, ఓర్పు పెరుగుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన జీవితం  మన చుట్టూ ఉన్న బంధాలు చాలా సంతోషంగా ఉంటాయి.

Spotlight

Read More →