Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం....

Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే!

Healthy Pregnancy Tips: గర్భధారణ సమయంలో తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి... పండ్లు, కూరగాయల నుండి ప్రోటీన్ల వరకు నిపుణులు సూచించే ఉత్తమ పోషకాహార చిట్కాలు మీ కోసం..

Published : 2026-04-11 18:12:00

Healthy Pregnancy Tips: గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఒక మధురమైన ఘట్టం. ఈ సమయంలో తన శరీరంలో పెరుగుతున్న ప్రాణానికి అవసరమైన అన్ని పోషకాలను అందించడం తల్లి బాధ్యత. కేవలం కడుపు నిండా తినడం ముఖ్యం కాదు, ఏం తింటున్నాము అనే దానిపై అవగాహన ఉండాలి. పూర్వంలా "ఇద్దరి కోసం తినాలి" అని కాకుండా, బలమైన ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణీలు రోజువారీ ఆహారంలో కనీసం రెండు రకాల పండ్లు, ఐదు రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్లు, టమాటాలు, అరటిపండ్లు  నారింజ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం అందుతుంది. ఇది గర్భధారణ సమయంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య అయిన మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ బిడ్డ మెదడు, వెన్నెముక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.

బియ్యం, గోధుమలు, ఓట్స్  రాగుల వంటి ముడి ధాన్యాలు శక్తికి ప్రధాన వనరులు. తెల్లటి అన్నం కంటే దంపుడు బియ్యం లేదా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగి జావ తాగడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్  కాల్షియం సహజంగా అందుతాయి. బిడ్డ కండరాలు  కణజాలం అభివృద్ధి చెందడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మంచిది. శాకాహారులు అయితే పప్పు ధాన్యాలు, శనగలు, పనీర్  సోయా వంటివి తీసుకోవాలి. మాంసాహారులు కొర్రమీను, బొచ్చె వంటి చేపలు  చికెన్ తీసుకోవచ్చు.

గర్భంలోని బిడ్డ ఎముకలు, పళ్ళు బలంగా ఉండాలంటే తల్లికి కాల్షియం అధికంగా అవసరం. లేదంటే తల్లి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజూ పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు పడని వారు బాదం పప్పులు లేదా నువ్వుల ద్వారా కాల్షియం పొందవచ్చు. రక్తహీనత రాకుండా ఉండాలంటే పాలకూర, బెల్లం, వేరుశనగ పట్టీలు వంటివి తినాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మరసం లేదా నారింజ పండ్లు తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా పడుతుంది. అలాగే, రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగుతూ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. బయటి జంక్ ఫుడ్, శీతల పానీయాలు  సరిగా ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా  వాడకూడదు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి మరియు సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకరమైన బిడ్డకు పునాదులు. ఈ సమాచారం కేవలం మీ అవ్వకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని  సంప్రదించడం మంచిది సుమీ.

Spotlight

Read More →