టెక్నాలజీ సమావేశాలు ఆన్లైన్ క్లాసులు వర్క్ మీటింగ్స్ ఈ రోజుల్లో మనం Google Meet ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. వీడియో మీటింగ్ సమయంలో స్క్రీన్‌పై కనిపించే చిన్న చిన్న ఎమోజీలు ఆ ఆన్లైన్ చర్చలకు కొద్దిపాటి భావోద్వేగాన్ని జోడిస్తాయి. అయితే ఇప్పటివరకు Google Meetలో ఉన్న emoji reactions చాలా పరిమితంగా ఉండేవి. కేవలం thumbs up, heart, clap వంటి తొమ్మిది బేసిక్ ఎమోజీలకే అవకాశం ఉండేది. ఇప్పుడు Google ఈ పరిమితులను తొలగిస్తూ, వినియోగదారులకు పూర్తిస్థాయి emoji library అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్‌డేట్ వల్ల మీటింగ్‌లో పాల్గొనే వారు తమ భావాలను మరింత బాగా వ్యక్తపరచగలరు.
Google Workspace బ్లాగ్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, Google Meetలో full emoji reactions ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే వేల సంఖ్యలో అందుబాటులో ఉన్న ఎమోజీల్లోంచి ఏ ఎమోజీ అయినా రియాక్షన్‌గా పంపుకోవచ్చు. ఈ మార్పు వర్క్ మీటింగ్స్‌ను మరింత సరదాగా ఆకర్షణీయంగా మార్చగలదని Google చెబుతోంది. మీటింగ్‌లో పాల్గొనే వారి స్పందనను మరింత స్పష్టంగా చూపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముందుగా ఉన్న బేసిక్ రియాక్షన్ల స్థానంలో ఇప్పుడు వినియోగదారులు తమ భావాన్ని సరైన రూపంలో వ్యక్తపరచే ఎమోజీని ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫీచర్ డిఫాల్ట్‌గా సక్రియం అవుతుంది. అవసరమైతే డొమైన్ అడ్మిన్లు లేదా సంస్థలోని గ్రూప్ అడ్మిన్లు ఈ సెట్టింగ్స్‌ను నియంత్రించవచ్చు. హోస్ట్లు మరియు కో-హోస్ట్లు కూడా మీటింగ్ సమయంలో ఎమోజీ రియాక్షన్లను ఆన్ లేదా ఆఫ్ చేయగలరు. పూర్తిస్థాయి ఎమోజీ లైబ్రరీని ఆఫ్ చేసి కేవలం పాత బేసిక్ ఎమోజీలను మాత్రమే కనిపించేలా చేయడానికి కూడా ఒక ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది.
అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి. Google Meet Rooms hardware అంటే మీటింగ్ రూమ్‌లలో ఉన్న ప్రత్యేక meet devices ఈ విస్తరించిన emoji లిస్ట్‌ను ఉపయోగించలేవు. కానీ ఇతరులు పంపిన ఎమోజీలను మాత్రం స్క్రీన్‌పై చూడగలుగుతారు. ఆ విధంగానే, live stream ద్వారా మీటింగ్ చూస్తున్నవారు కూడా ఎమోజీలు పంపలేరు కానీ ఇతరులు పంపిన రియాక్షన్లను వీక్షించవచ్చు. Companion mode ద్వారా మొబైల్ లేదా ఇతర పర్సనల్ డివైస్‌తో పాల్గొనే వారు మాత్రం అన్ని ఎమోజీలను పంపగలరు.
iOS వినియోగదారులకు మాత్రం పూర్తి ఎమోజీ రియాక్షన్ ఫీచర్ వెంటనే అందుబాటులో రాదు. ప్రస్తుతం వారు ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి పంపిన ఎమోజీలను మాత్రమే చూడగలరు. Apple పరికరాల కోసం ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని Google ప్రయత్నిస్తోంది. Android మరియు Web ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఈ అప్‌డేట్ ప్రారంభమయింది. Google అప్‌డేట్ ప్రకారం, Business Standard, Business Plus, Enterprise Standard మరియు Enterprise Plus ప్లాన్లకు ఈ ఫీచర్ రోలౌట్ అవుతోంది. వచ్చే రెండు వారాల్లో అన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఇటీవలి కాలంలో Google Meet ప్లాట్‌ఫామ్ అనేక మార్పులను చూస్తోంది. AI ఆధారిత మేకప్ ఫిల్టర్లు, మీటింగ్‌కు ముందుగా waiting room ఆప్షన్ కొత్త ఇంటర్‌ఫేస్ ఇలాంటి ఫీచర్లతో వీడియో కాల్స్ అనుభవాన్ని Google మరింత ఉత్తమంగా చేస్తోంది. ఇప్పుడు full emoji reactions వల్ల వర్చువల్ మీటింగ్స్ మరింత ప్రాణం వచ్చినట్టుగా అనిపించనున్నాయి. ఎమోజీలు మాటలకంటే త్వరగా భావాలను వ్యక్తపరచగలవు. అదే ప్రయోజనాన్ని Google Meet ఇప్పుడు అందిస్తోంది.