టెక్నాలజీ ప్రపంచం నేడు ఎంత వేగంగా మారిపోతుందో మనందరికీ తెలుసు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లు, రాడార్లు, మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ పనిచేయడానికి ఒకే గ్రూప్ పదార్థాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటినే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు.
ఈ పేరుతో వింటే ఇవి చాలా అరుదుగా దొరికే పదార్థాలేమో అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవి అరుదు కాదు — భూమిలో సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఇవి ఎక్కడ పడితే అక్కడ కాదు, చిన్న చిన్న పరిమాణాల్లో కలిసిపోయి ఉండటమే సమస్య. అందుకే తవ్వకాల వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా ఇవి రేర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి.
ఈ ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ ఏవి?
మొత్తం 17 రకాల లోహాలను రేర్ ఎర్త్ గ్రూప్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా:
సీరియం (Ce)
నియోడియమం (Nd)
యూరోపియం (Eu)
డైస్ప్రోసియం (Dy)
టెర్బియం (Tb)
ఇవి కొన్ని పేర్లు మాత్రమే. ఇవి అన్నీ ఒకే చోట దొరక్క, వేర్వేరు ఖనిజాల్లో మిశ్రమంగా ఉంటాయి. అందువల్ల వీటిని వేరు చేయడం అత్యంత కఠినమైన ప్రక్రియ. ఖర్చు ఎక్కువ కావడం వల్లే ఇవి విలువైనవి.
ఇవి ఏమి చేస్తాయి?
మన రోజువారీ వాడకంలో ఉండే దాదాపు ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరం వీటితోనే తయారవుతుంది:
మొబైల్ ఫోన్లు, టీవీలు,కంప్యూటర్లు,హార్డ్ డ్రైవ్స్
స్పీకర్లు ఎలక్ట్రిక్ కార్లు (EVs) లో ఉపయోగించే శక్తివంతమైన మాగ్నెట్‌లు కూడా రేర్ ఎర్త్ లోహాలతోనే తయారవుతాయి. ఇందులో ముఖ్యంగా నియోడియమం (Nd) మరియు సమారియం (Sm) ఆధారిత మాగ్నెట్‌లు అత్యంత శక్తివంతమైనవి. చిన్న పరిమాణంలోనే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు.
గ్రీన్ ఎనర్జీకి ఇవి రెడ్ హార్ట్
పరికరాలు తక్కువ శక్తిని వినియోగించి ఎక్కువ పనితీరు ఇవ్వడానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం. వాయు విద్యుత్ జనరేటర్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో కూడా వీటి వినియోగం పెరుగుతోంది.
గాలి టర్బైన్ మోటార్లలో
శక్తివంతమైన మాగ్నెట్‌లలో
హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల్లో
భవిష్యత్ శక్తి మార్గంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటే రక్షణ రంగంలో వీటి ప్రాముఖ్యత ఎంతంటే…
ఈ ఎలిమెంట్స్ లేకుండా ఆధునిక రక్షణ వ్యవస్థల ఊహ కూడా అసాధ్యం.
హఫైటర్ జెట్ ఇంజిన్లు
మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్
రాడార్ & లేజర్ వ్యవస్థలు
నైట్ విజన్ పరికరాలు ప్రతిరోజూ మనం చూసే ఆధునిక రక్షణ సాంకేతికత వెనుక ఉండేది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌శక్తే.
అయితే సమస్య ఎక్కడ?
ఈ పదార్థాలు భూమిలో ఉన్నాయే కానీ ఎక్కువగా చైనా నియంత్రణలో ఉన్నాయి. ప్రపంచ సరఫరాలో 80% పైగా చైనా కంట్రోల్ చేస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు వీటిని పొందేందుకు పోటీ పడుతున్నాయి.
ఖనిజాలు తవ్వడం కష్టం
వేరు చేయడం ఖర్చుతో కూడిన పని
ప్రాసెసింగ్‌కు ప్రత్యేక సాంకేతికత అవసరం
భవిష్యత్‌లో ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు?
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను పట్టు ఉన్న దేశమే భవిష్యత్తులో టెక్నాలజీ పవర్ అవుతుంది. వాహన పరిశ్రమ, రక్షణ వ్యవస్థ, కమ్యూనికేషన్ అన్ని రంగాలను ఇవే ప్రభావితం చేస్తాయి. భవిష్యత్ టెక్నాలజీకి రేర్ ఎర్త్ అంటే ఊపిరి లాంటివి.