తెలుగు ఐటీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి మరోసారి వేదిక సిద్ధమైంది. వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (WTITC) ప్రకటించిన ప్రకారం వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ – 2025 ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో డిసెంబర్ 12 నుంచి 14 వరకు జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ఐటీ నిపుణులు స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఈ కాన్ఫరెన్స్ రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు. గత సారి 2023లో సింగపూర్‌లో జరిగిన ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలు నుంచి వచ్చిన సుమారు 3,000 మంది ప్రతినిధులతో విశేష ఆదరణ పొందింది. తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్ ప్రభావాన్ని ప్రపంచానికి చూపిన ఈ సమావేశం, ఇప్పుడు దుబాయ్‌లో మరింత భారీ స్థాయిలో జరగనుంది.
మూడు రోజుల షెడ్యూల్ ఇలా ఉంటుంది
డిసెంబర్ 12న కాన్ఫరెన్స్ ప్రత్యేక నెట్‌వర్కింగ్ మీట్‌తో ప్రారంభమవుతుంది. ఇదేరోజు దుబాయ్ మరినా తీరంలో వైభవంగా యాచ్ పార్టీ కూడా నిర్వహిస్తారు. ఆ తరువాత డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లు, ప్యానెల్ చర్చలు ఉంటాయి. అలాగే, కొత్తగా ఎన్నికైన WTITC గ్లోబల్ లీడర్షిప్ టీమ్ ప్రమాణ స్వీకారం గ్రాండ్ ఓత్ సెరిమనీగా నిర్వహించనున్నారు. ఇది కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఏ రంగాల్లో చర్చలు జరుగుతాయి?
టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే అనేక కీలక రంగాల్లో నిపుణులు ప్రసంగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
సైబర్ సెక్యూరిటీ
బ్లాక్‌చెయిన్ & వెబ్ 3.0
క్వాంటం కంప్యూటింగ్
ఫిన్‌టెక్ & అగ్రిటెక్ ఇన్నోవేషన్‌లు
సెమీ-కండక్టర్ డిజైన్
క్లౌడ్ & డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్
తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్ ఈ రంగాల్లో గొప్ప ప్రభావం చూపుతున్నారని WTITC పేర్కొంటోంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు కూడా భాగస్వామ్యం
ఈ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేకత ఏమిటంటే — ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ అధికారికంగా మద్దతు తెలుపాయి. రెండు రాష్ట్రాల నుంచి ఉన్నత అధికారులు మంత్రులు పాల్గొని తమ తమ రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ ప్రాజెక్టులు, స్టార్టప్ అవకాశాలు, పెట్టుబడుల వివరాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంతో రెండు రాష్ట్రాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించగల అవకాశాలు మరింత పెరుగుతాయి.
దుబాయ్‌లో అధికారిక టీమ్ మీటింగ్
కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా WTITC దుబాయ్ లీడర్షిప్ టీమ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించింది. 40కి పైగా కోర్ టీమ్ మెంబర్స్ ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. వేదిక నిర్వహణ, లాజిస్టిక్స్, అంతర్జాతీయ అతిథుల ఆతిథ్యంపై విశ్లేషణాత్మకంగా సమీక్ష జరిపారు.
ఇది కేవలం కాన్ఫరెన్స్ కాదు… తెలుగు ఐటీ ప్రతిభకు గ్లోబల్ గుర్తింపు
WTITC చైర్మన్ సుందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ:
సింగపూర్‌లో మొదలైన విజయం ఈసారి దుబాయ్‌లో మరింత పెద్దదవుతుంది. ఇది టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై తెలుగు ప్రతిభను గర్వంగా చూపించే సందర్భం అని తెలిపారు.
ఎవరెవరు పాల్గొనవచ్చు?
ఐటీ ప్రొఫెషనల్స్
స్టార్టప్ ఫౌండర్లు
విద్యార్థులు
పరిశోధకులు
బిజినెస్ లీడర్లు
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఓపెన్ ఉన్నాయి. డెలిగేట్లు, స్పీకర్లు, స్పాన్సర్లు అప్లై చేయవచ్చు. మరింత సమాచారం కోసం.
India contact: +91 81231 23434
UAE contact: +971 56577 8923
Email: info@wtitc.org తెలుసుకోవచ్చు.
ఈ కాన్ఫరెన్స్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఒకే వేదికగా
ప్రపంచ స్థాయిలో నెట్వర్కింగ్ పెట్టుబడుల అవకాశాలు ఇన్నోవేషన్‌ల మార్పిడికి ఒక ముఖ్యమైన అవకాశం. దుబాయ్‌లో జరుగుతున్న ఈ అత్యంత ప్రెస్టీజియస్ ఈవెంట్ 2027 ఎడిషన్‌కు పునాది వేయనుంది.