రెడ్ బుల్‌కు FSSAI షాక్.. వారం టైమ్! బయటపడిన భయంకర నిజం!
Red Bull FSSAI notice: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్ రెడ్ బుల్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ పానీయంలో చక్కెర శాతం అధికంగా ఉండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 'ఎనర్జీ డ్రింక్' అనే లేబుల్ వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రెడ్ బుల్ తన ఉత్పత్తికి ఎనర్జీ డ్రింక్ అనే పేరు ఎందుకు కొనసాగించాలనే దానిపై శాస్త్రీయ ఆధారాలతో వివరణ ఇవ్వాలని FSSAI ఆదేశించింది.
- రెడ్ బుల్‌లో ప్రతి 100 మిల్లీలీటర్లకు 11 గ్రాముల చక్కెర ఉన్నట్లు FSSAI గుర్తించింది.
- ఎనర్జీ డ్రింక్ లేబుల్, చక్కెర శాతంపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది.
Red Bull FSSAI notice: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్ రెడ్ బుల్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ పానీయంలో చక్కెర శాతం అధికంగా ఉండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 'ఎనర్జీ డ్రింక్' అనే లేబుల్ వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రెడ్ బుల్ తన ఉత్పత్తికి ఎనర్జీ డ్రింక్ అనే పేరు ఎందుకు కొనసాగించాలనే దానిపై శాస్త్రీయ ఆధారాలతో వివరణ ఇవ్వాలని FSSAI ఆదేశించింది.
7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
రెడ్ బుల్ పానీయంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 11 గ్రాముల చక్కెర ఉన్నట్లు FSSAI గుర్తించింది. ఈ లెక్కన 500 మిల్లీలీటర్ల పానీయం తీసుకుంటే సుమారు 55 గ్రాముల చక్కెర శరీరంలోకి చేరుతుంది. సాధారణంగా రోజుకు 50 గ్రాములకు మించకుండా చక్కెర తీసుకోవాలనే సిఫార్సు ఉండగా.. రెడ్ బుల్‌లోని చక్కెర పరిమాణం అంతకంటే ఎక్కువగా ఉండటం అధికారులను ఆందోళనకు గురిచేసింది. రోజుకు 500 మిల్లీలీటర్లకు మించి తాగవద్దని కంపెనీ సూచించడం కూడా వినియోగదారుల్లో అపోహలకు దారితీయవచ్చని FSSAI పేర్కొంది. ఈ అంశాలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కంపెనీకి నోటీసులు పంపింది.
ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై వివాదం
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత జూన్‌లో రెడ్ బుల్ సహా పలు కంపెనీల ఎనర్జీ డ్రింక్స్‌పై 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని రెడ్ బుల్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ సందర్భంగా కంపెనీకి వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ సెప్టెంబర్‌లో హైకోర్టు ఆ ఉత్తర్వులను పక్కనపెట్టింది. తాజాగా కంపెనీకి మరోసారి నోటీసులు జారీ చేస్తూ FSSAI వివరణ కోరింది.
ఇతర కంపెనీలపైనా ప్రభావం
ఈ వివాదంలో పెప్సికో, మాన్స్టర్ బెవరేజ్, రిలయన్స్ కన్జ్యూమర్ వంటి సంస్థల పేర్లు కూడా ఉన్నాయి. రెడ్ బుల్‌కు కోర్టు తాత్కాలికంగా ఊరట కల్పించగా.. ఇతర కంపెనీలు ఇప్పటికే ఉన్న స్టాక్ విక్రయించిన తర్వాత ఎనర్జీ డ్రింక్ లేబుల్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. రెడ్ బుల్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించడం ఇతర కంపెనీలకు అన్యాయం చేస్తుందని FSSAI అభిప్రాయపడుతోంది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో జనవరిలో మరోసారి విచారణ జరగనుంది.
ఆరోగ్యంపై నిపుణుల ఆందోళన
ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెరతో పాటు కెఫీన్, టౌరిన్ వంటి పదార్థాలు అధికంగా ఉండటంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లో ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ 2028 నాటికి 1.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఉత్పత్తుల లేబులింగ్, పోషక విలువలు, ఆరోగ్య భద్రతపై FSSAI మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
Tags
Be the first to react